ఫిలిం ఇండస్ట్రీని సెంటిమెంట్లు ప్రభావితం చేసినంతగా మరే రంగాన్ని ప్రభావితం చేయవు. టాప్ హీరోలు కూడ ఈ సెంటిమెంట్ల కోసం అనేక ఆశ్చర్యకర విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థుతులలో మెగా హీరోల సంక్రాంతి సక్సస్ కు ‘శ్రీ’ సెంటిమెంట్ కలిసిరాదా అనే విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

గత సంవత్సరం అత్యంత భారీ అంచనాలతో జనవరి 10న విడుదలైన ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ పవన్ అభిమానులు మరిచిపోలేని చేదు నిజం. ఈసినిమా విడుదలై ఏడాది గడిచిపోయినా పవన్ అభిమానులు ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. 

అదేవిధంగా నిన్న భారీ అంచనాలతో విడుదలైన చరణ్ ‘వినయ విధేయ రామ’ ఈ ఏడాది సంక్రాంతి భారీ ఫ్లాప్ గా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. చరణ్ అభిమానులకు కూడ ఏమాత్రం నచ్చని ఈమూవీ ఫెయిల్యూర్ తో ఏస్థాయిలో బయ్యర్లు నష్టపోతారు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఆశ్చర్యకరంగా ఈరెండు సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుల పేర్లు ‘శ్రీ’ పదంతో ప్రారంభం అవుతాయి. ‘అజ్ఞాతవాసి’ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తే ‘వినయ విధేయ రామ’ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు కూడ సంక్రాంతి భారీ ఫ్లాప్స్ గా మారాయి. దీనితో రానున్న రోజులలో మెగా హీరోలు ఎవరైనా ‘శ్రీ’ పదంతో ప్రారంభం అయ్యే దర్శకుల సినిమాలలో నటించినా ఆసినిమాలను ఎట్టి పరిస్థుతులలోను సంక్రాంతి రిలీజ్ కు విడుదల చేయడానికి హడిలిపోతారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: