సినిమాలకు పవన్ కళ్యాణ్ దూరం కావడంతో ఈ ఏడాది సంక్రాంతి సినిమాల రేసులో పవన్ సినిమా లేకపోవడంతో ఆ వారసత్వాన్ని చరణ్ కొనసాగించాడు. అయితే స్టెప్స్ అంటే ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనం మధ్య సంక్రాంతి స్టెప్ వేయబోతున్నాడు. 
జనసేనలోకి నేతలకు ఆహ్వానం
తెలుస్తున్న సమాచారం మేరకు సంక్రాంతి సంబరాల కోసం పవన్ కళ్యాణ్ ఈనెల 13న తెనాలి వెళ్ళబోతున్నాడు. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో అక్కడ సినిమాటిక్‌ గా జరిగే పొంగల్ సెలబ్రేషన్స్‌ లో పవన్ కళ్యాణ్ జోష్ నింపడానికి అక్కడి మహిళా ‘జనసేన’ కార్యకర్తలతో సంక్రాంతి పాటకు స్టెప్స్ వేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత
సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అందిస్తూ ‘జన సేన’ సిద్ధాంతాలను వివరించే ఒక ప్రచారగీతం ఆసంక్రాంతి కార్యక్రమంలో విడుదుల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాటను విడుదలచేసిన తరువాత ఆకార్యక్రమానికి జోష్ ను నింపడానికి రెండు స్టెప్స్ కూడ వేయడానికి పవన్ అంగీకరించినట్లు సమాచారం.
నాతోపాటు బలంగా పోరాడే వారి కోసం చూస్తున్నా
నిన్న పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలో తన ‘జనసేన’ కార్యకర్తలలో జోష్ ను నింపడానికి ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. రాబోతున్న ఎన్నికలలో తనకు ఓట్లు పడవు అని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తనతో రాబోతున్న ఎన్నికలలో సీట్లు సద్దుబాటు చేసుకోమని టిఆర్ఎస్ ముఖ్యనాయకుల ద్వారా రాయబారాలు తనతో చేస్తున్న విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. దీనితో పవన్ రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో జత కడతాడా అనే విషయాలకు సంబంధించిన ఊహాగానాలకు పవన్ కామెంట్స్ మళ్ళీ జీవం పోసాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: