మిష్టీ చక్రవర్తి.. ఈ బెంగాలీ భామ అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. ఇటీవల శరభ సినిమాలోనూ ఈ హీరోయిన్ నటించింది. తాజాగా ఆమె మణికర్ణిక సినిమాలో కాశీబాయ్ పాత్ర పోషించింది. అయితే ఇది సహాయక పాత్రమే.

Image result for Mishti Chakraborty manikarnika


ఈ రోల్ పోషించేందుకు మిష్టీ చక్రవర్తి మొదట చాలా సందేహించిందట. ఇలాంటి సైడ్ క్యారెక్టర్లు చేస్తే ఆ తర్వాత హీరోయిన్‌ గా ఛాన్సులు వస్తాయా అని భయపడిందట. కానీ డైరెక్టర్ క్రిష్ వల్లే తాను ఆ పాత్ర చేశానని చెబుతోంది మిష్టి.



ఈ చిత్రంలో మిష్టి మణికర్ణిక సహాయకురాలుగా కనిపిస్తుంది. ఈ సినిమా ప్రాముఖ్యాన్ని నిర్మాత వివరించాక ఓకే చెప్పేసిందట. క్రిష్‌ గురించి తాను చాలా విన్నానని.. అందుకే ఆయన సినిమాలో నటించేందుకు ఓకే చెప్పానని మిష్టి చెబుతోంది.

Image result for Mishti Chakraborty manikarnika


మణికర్ణిక సహాయకురాలు పాత్రకు మిష్టీ అయితే సరిపోతుందని క్రిష్ ఫీలయ్యాడట. మిష్టీ ఫోటోను ఆయనే స్వయంగా నిర్మాతకు పంపారట. ఈ విషయం తర్వాత తెలిసి మిష్టీ మురిసిపోయిందట. మొత్తానికి మణికర్ణిక ప్రయాణం మరపురానిదంటోంది మిష్టీ.


మరింత సమాచారం తెలుసుకోండి: