ఎన్టీఆర్ బయోపిక్ ‘కధానాయకుడు’ బాలకృష్ణకు పూర్తిగా జోష్ ను ఇవ్వలేకపోయినా అక్కినేని కుటుంబసభ్యులలో అక్కినేని బయోపిక్ ఆలోచనలు తిరిగి ప్రారంభం అయ్యేలా దోహదపడింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి  సినిమా రంగంలో బయోపిక్‌ లకు పెద్దగా ఆదరణ ఉండదు అనే అభిప్రాయాలు ఉన్నా సావిత్రి జీవిత కథ ‘మహానటి’ విజయవంతం అవడంతో ఇండస్ట్రీ వర్గాల ఆలోచనలు మారిపోయాయి. 

సావిత్రి గురించి తెలిసిన వాళ్లే కాదు తెలియని వాళ్లు కూడా ఈసినిమా చూసి ఒక అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. అయితే ఇదే ట్రెండ్ ను ఎన్టీఆర్ బయోపిక్  కొనసాగిస్తుంది అని ఏర్పడిన భారీ అంచనాలను ‘కథానాయకుడు’ అందుకోలేక పోయింది. కమర్షియల్‌గా ‘యన్.టి.ఆర్’ బయోపిక్ ఏస్థాయి విజయం సాధిస్తుందన్నది పక్కన పెడితే అక్కినేని బయోపిక్ పై ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ లో జరుగుతున్న చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

వాస్తవానికి అక్కినేని బయోపిక్ తీయమని సూచనలు గతంలో నాగార్జనకు వచ్చినా ఆసూచనలు పట్ల నాగార్జున ఏమాత్రం ఆసక్తి కనపరచలేదు. అంతేకాదు అక్కినేని జీవితంలో చెప్పుకోతగ్గ వివాదాస్పద అంశాలు లేని నేపధ్యంలో ఈమూవీని జనం చూడరు అన్న అభిప్రాయాన్ని ఓపెన్ గా నే నాగార్జున చెప్పాడు. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్రను సుమంత్ పోషించి ప్రశంసలు అందుకున్న నేపధ్యంలో సుమంత్ తో అక్కినేని బయోపిక్ ను తీయమని కొందరు నాగార్జునకు సూచనలు ఇస్తున్నట్లు టాక్. ఈ సూచనలకు నాగార్జున తిరస్కరించకుండా నవ్వుతూనే తన సమాధానాన్ని దాటివేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో నాగ్ ఆలోచనలలో అక్కినేని బయోపిక్ ఉందా ? లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: