ఒక మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఒక టాప్ హీరో నటించే సినిమాకు ఆబ్లాక్ బస్టర్ మూవీ ఇమేజ్ శాపంగా మారుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రామ్ చరణ్ కు ఏర్పడింది. నిన్న విడుదలైన ‘వినయ విధేయ రామ’ భారీ ఫ్లాప్ గా మారడం వెనుక చరణ్ కు ‘రంగస్థలం’ తరువాత ఏర్పడిన ఇమేజ్. 
 నాన్ బాహుబలి రికార్డ్
‘రంగస్థలం’ లో చెవిటి వాడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన చరణ్ ‘వినయ విధేయ రామ’ లో బాగా నటించినా ఆ చిట్టిబాబు పాత్ర ఇమేజ్ నుండి బయటకు రావడానికి చరణ్ ప్రయత్నించినా ప్రేక్షకులు ఒప్పుకోలేదు. అన్ని సినిమాలు ‘రంగస్థలం’ లా ఉండవు అంటూ చరణ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పినా ప్రేక్షకులు మాత్రం చరణ్ నుండి మరొక వెరైటీ సినిమాను ఆశించడంతో ఆ అంచనాలు అందుకోలేక ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ గా మారింది అని అంటున్నారు.
సంక్రాంతి సీజన్
వాస్తవానికి ఈమూవీ బోయపాటి స్టైల్ లో ఉన్న సాధారణ మాస్ సినిమా. ముందుగా ఈకథను చరణ్ విన్నప్పుడు ఈమూవీలో నటించాలా వద్దా అనే సందేహంలో ఉన్నప్పుడు చిరంజీవి చరణ్ ను ఈసినిమాను చేయమని ప్రోత్సహించాడు అని టాక్. దీనికి కారణం ఈసినిమాను చరణ్ ఒప్పుకున్నప్పుడు ఇంకా ‘రంగస్థలం’ రిలీజ్ కాలేదు. 
కళ్ళు చెదిరే ఓపెనింగ్స్
‘రంగస్థలం’ మూవీ రిజల్ట్ ఫై చిరంజీవికి అప్పట్లో అనుమానాలు ఉన్న నేపధ్యంలో ఎందుకైనా మంచిదని మెగా హీరోలకు కలిసివచ్చే మాస్ సినిమాను చేయమని చరణ్ ను ప్రోత్సహించి ‘వినయ విధేయ రామ’ లో నటించేలా చేసాడు అనే వార్తలు ఉన్నాయి. అయితే ఊహించని విధంగా ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ ఇమేజ్ నుండి బయటపడాలని చరణ్ ప్రయత్నించినా ఆప్రయత్నాలు ‘వినయ విధేయ రామ’ లో ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో చిరంజీవి అంచనాలు చరణ్ విషయంలో తారుమారు అయ్యాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: