తెలుగు ఇండస్ట్రీలో శివ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ తర్వా త కామెడీ, మాఫియా, హర్రర్ కాన్సెప్ట్ తో పలు చిత్రాలు తీశారు.  ఆ చిత్రాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి.  కానీ కొంత కాలంగా వర్మ తీస్తున్న చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.  కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన చిత్రాలు తీసుకుంటూ వెళ్తున్నారు.  తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Image result for laxmi's ntr laxmi parvathi first look
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్, రెండు పాటలను చిత్రబృందం విడుదల చేసింది. అంతే కాదు ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా ఎవరు నటిస్తున్నారనే విషయమై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు లక్ష్మీ పార్వతి గురించి ఎంతో మంది నటీమణుల పేర్లు బయటకు వచ్చాయి..కానీ ఆ సస్పెన్స్ కి తెరదించుతూ..లక్ష్మీపార్వతి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వదిలారు.

అంతే కాదు  ఎవ్వరి ఊహలకు అందకుండా వర్మ ఓ కన్నడ నటిని లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఎంచుకున్నారు. కన్నడ నటి యజ్ఞా శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా కనిపించనుందని వర్మ తెలిపారు. వర్మ గతంలో తీసిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో ఆమె నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: