కొత్త సంవత్సరం వచ్చేయడంతో ఈ సమ్మర్ కు మళ్ళీ బుల్లితెర పై హడావిడి చేయబోతున్న ‘బిగ్ బాస్ 3 సీజన్ కు సంబంధించిన వార్తల హడావిడి మొదలైంది. ఈకార్యక్రమాన్ని హోస్ట్ చేసే ‘స్టార్ మా’ ఛానల్ కొన్ని లీకులు ఇస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయాల పై వ్యూహాత్మక సర్వే చేస్తోంది. 

ఇప్పటికే ఈకార్యక్రమానికి సంబంధించి వెంకటేష్ ను హోస్ట్ గా పెడితే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయాలను సేకరించిన స్టార్ మా ఇప్పుడు ఇదే కార్యక్రమానికి హోస్ట్ లుగా గతసంవత్సరం ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్ ను హోస్ట్ గా పెడితే ఎలా ఉంటుంది అన్న విషయమై లీకులు ఇస్తోంది. గత సంవత్సరం కౌశల్ ఆర్మీ పేరుతో సంచలనాలు జరిగిన నేపధ్యంలో కౌశల్ ను ఈ షోకు హోస్ట్ గా పెడితే ఈషోకు రేటింగ్స్ బాగా వస్తాయి అన్న సూచనలు ‘స్టార్ మా’ యాజమాన్యానికి వస్తున్నట్లు టాక్.

అది కుదరకుంటే ‘బిగ్ బాస్ 3’ షోకు హోస్ట్ గా రానాను పెట్టె ఆలోచనలు కూడ స్టార్ మా యాజమాన్యానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘యారీ నెంబర్ 1’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన రానా ఈషో నిర్వాహణకు అన్ని విధాలా సరిపోతాడనీ స్టార్ మా యాజమాన్యానికి సూచనలు కూడ వస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక కౌశల్ విషయానికి వస్తే ఆ మధ్య కౌశల్ చెప్పిన విషయాలు ముఖ్యంగా అతడికి ప్రధానమంత్రి కార్యాలయం నుండి ‘బిగ్ బాస్ 2’ విన్నర్ అయిన సందర్భంలో అభినందనలు వచ్చాయి అన్న విషయంలో కొన్ని వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనితో సెలెబ్రెటీ స్టేటస్ ను దృష్టిలో పెట్టుకుని రానా అంగీకరిస్తే ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా రానా ఎంపిక అయ్యే ఆస్కారం చాల ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: