వాళ్లంతా వెండితెరపై సూపర్ స్టార్స్.. సమాజానికి నీతులు చెబుతుంటారు. సినిమాల్లో జనం కోసం ప్రాణాలు ఇస్తుంటారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం కొందరు స్టార్స్ రూల్స్ పాటించడం లేదట. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Image result for mahesh babu


వెండితెర వేల్పులుగా వెలుగుతున్న బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌, మహేశ్‌ వంటి ప్రముఖులతో పాటు పలువులు సెలబ్రెటీలు ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘించారట. అంతే కాదు.. అడ్డగోలుగా ప్రయాణించడమే కాకుండా.. అందుకు ఫైన్ వేస్తే.. ఆ చలాన్లను కట్టడం లేదట. వీరిలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న మహేశ్‌ బాబు మూడేళ్లలో ఏడుసార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడట.

Related image


మహేశ్ బాబు వాహనం AP09 CM 4005 ట్రాఫిక్ ఉల్లంఘనలకు గానీ.. ట్రాఫిక్ పోలీసులు మొత్తం రూ. 8700 వరకూ ఫైన్ విధించారు. కానీ ఇంతవరకూ మహేశ్‌ బాబు ఈ ఫైన్ క్లియర్‌ చేయలేదు. ఇక నందమూరి బాలకృష్ణ వాహనం రాజేంద్రనగర్ పరిథిలో పరిమితికి మించి వేగంగా వెళ్లిన ఘటనలో రూ. 1000 ఫైన్ విధించారు. కానీ బాలయ్య ఇంతవరకూ దీన్ని కట్టలేదు.

Image result for balakrishna


ఇక సినీస్టార్‌ ప్లస్ జనసేనాని పవన్ కల్యాణ్ వాహనం AP 09 CG 7778 పై మూడు సార్లు ఫైన్ పడిందట. మాదాపూర్, బంజారాహిల్స్ పోలీసులు రాసిన ఈ చలానాల్లో మొత్తం రూ. 500 ఫైన్ కట్టాల్సి ఉందట పవన్ కల్యాణ్. ఇంకా చలాన్లు కట్టని టాలీవుడ్ నటుల జాబితాలో హీరో నితిన్, కమెడియన్ సునీల్ కూడా ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: