భారతీయ సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంశాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయిమొదట్లో ఈ అంశాలపై మాట్లాడేందుకు నటీ నటులు జంకేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిందిచాలా మంది హీరోయిన్లు ఈ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

Related image


తాజాగా హీరోయిన్ నిత్యామీనన్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై స్పందించింది. నిజాయితీ చెప్పాలంటే తనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదట.

Related image


ఇంతవరకూ ఎవరూ తన వద్ద అడ్వాంటేజ్ తీసుకోలేదట. అయినా తన జాగ్రత్తలో తాను ఉంటానని నిత్యామీనన్ అంటోంది. ఇక్కడే కాదు.. కామాంధులు అన్నిరంగాల్లోనూ ఉంటారు. సినీరంగంలోనే ఇలాంటి వ్యక్తులు ఉంటారని చెప్పలేం అని చెబుతోంది.

Related image


మహిళలు తమ హక్కుల గురించి, భద్రత గురించి తాము సొంతగా ఆలోచించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిత్యామీనన్ సూచిస్తోంది. సినిమాలే జీవితంగా బతకడం తనకు చాతకాదని అంటోంది నిత్యామీనన్.


మరింత సమాచారం తెలుసుకోండి: