రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ ‘జనసేన’ కు 10 శాతం మించి ఓట్లు రావని జాతీయ మీడియా సర్వేలు చెపుతున్నాయి. అయితే అలాంటి పవన్ ఆలోచనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించాడు అంటూ పవన్ వీరాభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

గత సంవత్సరం నవంబర్ నెలలో పవన్ ‘జనసేన’ నిధుల సమీకరణకు అమెరికా వెళ్ళాడు. అక్కడ తన అభిమానులతో అనేక సమావేశాలు కూడ నిర్వహించాడు. ఈసమావేసాలలో పాల్గొన్న కొందరు ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలపై అనుసరిస్తున్న కఠిన విధానాలు వల్ల అమెరికాలో ఉన్న తెలుగువారికి కలుగుతున్న నష్టాలను వివరించారు. 

ఈ విషయాలను తెలుసుకున్న పవన్ హెచ్-1బి వీసాల సమస్య పై ఒక పరిష్కారం చూడమని అక్కడి భారతీయ సంతతికి చెందిన సేనేటర్స్ సమావేశం కావడమే కాకుండా అక్కడి దేశ అధ్యక్షుడు ట్రంప్ కు ఈ సమస్య పై ఒక పరిష్కారం చూడమని అభ్యర్ధిస్తూ పవన్ ఒక ఉత్తరం కూడ వ్రాసాడు. ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాల విషయంలో తమ ప్రభుత్వ కఠిన నిభందనలను సరళతరం చేస్తూ ఈమధ్య ఒక ప్రకటన ఇచ్చి భారతీయులకు జోష్ ను కలిగించింది.

దీనితో ఇది అంతా పవన్ ఈవిషయం పై అక్కడి సేనేటర్స్ తో చేసిన చర్చలు వల్ల ట్రంప్ కు వ్రాసిన ఉత్తరం వల్ల జరిగింది అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. దీనితో అమెరికా అధ్యక్షుడుని ప్రభావితం చేయగల పవన్ కు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కేవలం పది శాతం ఓట్లు వస్తాయని సర్వేలు ఎందుకు చేపుతున్నాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: