‘హృదయకాలేయం’ మూవీతో ఒకేసారి సెలెబ్రెటీగా మారిపోయిన సంపూర్ణేష్ బాబు ఒక సర్ప్రైజింగ్ స్టార్. ఆ తరువాత అతడికి చాల అవకాశాలు హీరోగా వచ్చాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనవలసినది ‘సింగం 123’ మంచు విష్ణు నిర్మించిన ఈ మూవీ తెలుగులో పెద్దగా సక్సస్ కాలేదు. అయితే ఈ మూవీని హిందీ భాషలోకి డబ్ చేసి నష్టాల బారిన పడకుండా మంచు  విష్ణు వ్యూహాత్మకంగా వ్యహరించాడు.  
Kobbari Matta
హిందీ సినిమాలతో పాటు హిందీ సినిమాల డబ్బింగ్ లు కూడ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతూ ఉంటాయి. ఈ నేపధ్యంలో ఈమధ్య ‘సింగం 123’ హిందీ డబ్బింగ్ ఇండోనేషియాలో విడుదలైంది. అక్కడ చాలామంది ప్రజలు హిందీ సినిమాలను బాగా చూస్తారు.

ఇలాంటి పరిస్థుతులలో ఇండోనేషియాలో ‘సింగం 123’ హిందీ డబ్బింగ్ ను చూసిన వారికి సంపూ లుక్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ విపరీతంగా నచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో సంపూర్ణేష్ అరటి పండును కత్తిలా వాడి కోడిని బాణంలా విసిరి వెరైటీగా చేసిన ఫైట్‌ సంపూర్ణేష్‌ కు విదేశీ అభిమానులను సంపాదించి పెట్టింది అన్న వార్తలు వస్తున్నాయి.

దీనితో ఈవిషయాలను తెలుసుకున్న నిర్మాతలు సంపూర్ణేష్ నటించిన ‘హృదయకాలేయం’ మూవీని హిందీలోకి డబ్ చేసి ఇండోనేషియాలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్. సంపూర్ణేష్ నటించిన ‘కొబ్బరిమట్ట’ విడుదలకు మార్కెటింగ్ సమస్యలు ఏర్పడిన నేపధ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ బయ్యర్లకు తెలిస్తే ‘కొబ్బరిమట్ట’ మార్కెటింగ్ సమస్యలు తీరిపోయి తిరిగి సంపూర్ణేష్ కు మంచిరోజులు వస్తాయి అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: