‘గీత గోవిందం’ తో క్రేజీ బ్యూటీగా మారిపోయిన రష్మికకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి నేపధ్యంలో ఒక వీరాభిమాని ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ కు రష్మిక భావోద్వేగానికి లోనై కంట కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. రష్మిక ఇప్పటి వరకు నటించిన సినిమాలలోని స్టిల్స్ తో పాటుగా ఆమె చిన్ననాటి ఫోటోలను కలిపి ఒక అభిమాని ఒక వీడియోగా మార్చి ఆమెకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు.

తన ట్విటర్ ఎకౌంట్ కు ట్యాగ్ అయిన ఆ వీడియోను చూసి రష్మిక కన్నీటి పర్యంతం అయిందట. దీనికి కారణం ఆమెకు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు అని తెలుస్తోంది. ఈ విషయమై ఆమె తన అభిమానికి భావోద్వేగంతో ట్విట్ చేస్తూ  ‘నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ ఎడిట్‌ చూస్తున్నప్పుడు ఏడ్చేశాను. ఏం చేశానని ఇంత ప్రేమకు నేను అర్హురాలినో తెలియదు కానీ మీలా ప్రోత్సహించే వారు నాచుట్టూ ఉన్నందుకు గర్వంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కన్నీరు ఆగట్లేదు. ఐ లవ్‌ యు సో మచ్‌ గాయ్స్‌’ అని రష్మిక ట్వీట్‌‌లో పేర్కొంది.

దీనితో ఈ ట్విట్ వైరల్ గా రష్మిక అభిమానుల మధ్య మారింది. ప్రస్తుతం ఈమె హవా తారా స్థాయిలో కొనసాగుతున్న నేపధ్యంలో ఈమెను ‘ఆర్ ఆర్ ఆర్’ లో హీరోయిన్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు రాజమౌళి లాంటి వ్యక్తులకు కలుగుతున్నాయి అంటే రష్మిక మ్యానియా అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈమె తిరిగి విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ఈ సమ్మర్ రేసుకు రాబోతోంది. 

ఈమూవీ కూడ సక్సస్ అయితే ఆమె టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోపోవడం ఖాయం అని అంటున్నారు.  ప్రస్తుతం ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న అభిమానుల సంఖ్య టాప్ హీరోల అభిమానుల రేంజ్ లో కొనసాగుతోంది. భారీ పారితోషికాలు ఇస్తాము అంటూ ఆమె చుట్టూ అనేక మంది దర్శక నిర్మాతలు తిరుగుతూ ఉన్నా తాను ఒప్పుకునే సినిమాల విషయంలో చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రష్మిక..  



మరింత సమాచారం తెలుసుకోండి: