ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ మూవీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి స్పందన రాకపోయినా ఆమూవీ ప్రమోషన్ విషయంలో క్రిష్ ఏమాత్రం అలసత్వం  ప్రదర్శించడంలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ కోసం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి తన మనసులో ఉన్న పార్ట్ ౩ ఆలోచనలను బయటపెట్టాడు. 
NTR Kathanayakudu
‘కధానాయకుడు’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ ఈలీకులు ఇచ్చాడు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి చివరిరోజుల విషయాలను అప్పటి వైస్రాయ్ హోటల్ సంఘటనలను తీయకుండా ఎన్టీఆర్ బయోపిక్ ఏమిటి అంటూ కొందరు విమర్శిస్తున్న విషయాలు తన దృష్టి వరకు వచ్చాయని అయితే ఆసంఘటనలలో అసలు నిజాలు బాలకృష్ణ ఒప్పుకుంటే తాను సినిమాగా తీయడానికి రెడీగా అన్న అభిప్రాయాలను వ్యక్త పరిచాడు. 

అంతేకాదు ఎన్టీఆర్ చివరిరోజులకు సంబంధించిన విషయాలపై ఎవరి ఊహలు వారికి ఉన్నాయి అంటూ అయితే అసలు వాస్తవాలు వేరు అంటూ అందుకనే తాను బాలయ్య అంగీకరిస్తే పార్ట్ ౩ తీస్తాను అని అంటున్నాడు. దీనితో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కౌంటర్ గా క్రిష్ మరోప్రయోగం చేయబోతున్నాడా అని అనిపించడం సహజం. 
NTR Kathanayakudu.jpg
క్రిష్ అలొచనలు ఎలా ఉన్నా వివాదలకు దూరంగా ఉండే క్రిష్ నోటివెంట ఇప్పడు ఎన్టీఆర్ బయోపిక్ లీకులు రావడం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది. ఇది ఇలా ఉండగా సంక్రాంతి రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల అయిన ‘కధానాయకుడు’ కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థితులలో ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న పార్ట్ 2 ‘మహానాయకుడు’ పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: