విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన 'ఎఫ్‌ 2’ సంక్రాంతి రేస్ విన్నర్ గా ప్రకటింపబడింది. సంక్రాంతి రేస్ కు వచ్చిన భారీ సినిమాల మధ్య ఊహించని ఘన విజయం సాధించుకున్న ఈమూవీ యూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకుంది.  ఈమీడియా మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ ఈసినిమాకు వచ్చిన స్పందన తనకు విపరీతమైన ఆనందాన్ని ఇచ్చిందని చాల రోజుల తరువాత తాను ధియేటర్ కు వెళ్లి ప్రేక్షకులతో కూర్చుని సినిమాను చూసి తెగ ఎంజాయ్ చేసిన విషయాన్ని వివరించాడు.
ఆంధ్ర, తెలంగాణ అంతటా అదరగొడుతోంది
ఇదే మీడియా మీట్ లో మాట్లాడిన వరుణ్ తేజ్ ఆంధ్రా తెలంగాణ అన్న ప్రాంత భేదాలు లేకుండా ఈసినిమా ప్రతిచోటా సక్సస్ టాక్ ను అందుకోవడం తమ అదృష్టం అంటూ ఈమూవీలో వెంకటేష్ తో నటించడం తన అదృష్టం అన్నాడు. అంతేకాదు వెలిగిపోతున్న దిల్ రాజ్ ముఖం చూస్తుంటే ఈమూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న విషయం డిసైడ్ అయిపోయింది అన్న విషయాన్ని మెగా ప్రిన్స్ వివరించాడు. 
బొమ్మ బ్లాక్ బస్టర్
ఇక దిల్ రాజ్ మాట్లాడుతూ ఈసినిమా సక్సస్ మీట్ ను భారీ స్థాయిలో ఈనెల 18 లేదా 19న ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపి ఎక్కడా ఈమూవీకి సంబంధించిన టిక్కెట్లు దొరకడం లేదు అని వస్తున్న వార్తలు తనకు ఆనందాన్ని కలిగిస్తున్నట్లు తెలియచేసాడు. దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ ఈసినిమాలోని ప్రతి డైలాగ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని వివరించాడు. 
చాలా రోజుల తర్వాత ఇలా...
ఈసినిమా సక్సస్ తో దర్శకుడు అనీల్ రావిపూడికి హ్యాట్రిక్ సక్సస్ వచ్చినట్లు అయింది. చాలకాలం తరువాత ఈసినిమాతో వెంకటేష్ మళ్ళీ సక్సస్ బాట పట్టడంతో ఈసీనియర్ హీరోకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. సంక్రాంతి రేసుకు సంబంధించి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పులో ప్రధమ స్థానం ‘ఎఫ్ 2’ కు వస్తే ద్వితీయ స్థానం ‘కథానాయకుడు’ కు వచ్చింది. డబ్బింగ్ సినిమాగా వచ్చిన ‘పేట’ కు వచ్చిన స్పందన కూడ ‘వినయ విధేయ రామ’ కు రాకపోవడంతో చరణ్ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ గా ఆమూవీ మారిపోయింది. ఊహించని ఈ సక్సస్ ను చూసి కాబోలు వెంకటేష్ ‘ఎఫ్ 2’ సక్సస్ మీట్ లో బాణాసంచా కాల్చాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: