మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ని అలరిస్తోంది. దాదాపుగా అందరు హీరోల పక్కన మెరిసిన ఈ అమ్మడు హిట్లు  ఎన్నో తన ఖాతాలో వేసుకుంది. కుర్ర కారు కలల రాణిగా ఒకనాడు వెండి తెరను ఏలిన ఈ క్యూటీకి ఈ మధ్యన అవకాశాలు అంతగా లేకుండా పోయాయి. తమన్నాకు భారీ హిట్ అంటూ ఉంటే అది బాహుబలి బిగినింగ్ లోనే దక్కింది. అంటే తమన్నా  హిట్ ని టేస్ట్ చేసి నాలుగేళ్ళు గడచిపోయాయన్నమాట


అటువంటి తమన్నాకు సరైన మూవీ ఒకటి పడింది. అదీ  ఈ సంక్రాతికి. ఇంకేం తమన్నా ఈజ్ బ్యాక్ అంటున్నారంతా. ఎఫ్ టు మూవీలో సీనియర్ హీరో వెంకటెశ్ పక్కన నటించిన తమన్నా ఈ మూవీ హిట్ తో మరో మారు ఫాం లోకి వచ్చేసింది గతంలో సీనియర్ల పక్కన చాన్సులు వచ్చిన నో చెప్పిన ఈ ముద్దు గుమ్మ అవకాశాలు లేక ఎస్ అంటే ఆ మూవీయే ప్లస్ అయింది. పైగా ఈ మూవీలో తమన్నా  తన అందలాతో అదరగొట్టేసిందని టాక్. దాంతో తమన్నా తడాఖ ఏంటన్నది అందరికీ తెలియచెప్పిందట. తన కంటే జూనియర్ అయిన మెహ్రిన్ కౌర్ తో పోటీ పడి మరీ తమన్నా  అందాల ప్రదర్శన చేసిందట.


ఇక తన కష్టానికి తగినట్లుగా ఈ మూవీ హిట్ కావడంతో ఈ సంక్రాంతి సుందరి తెగ హ్యాపీగా ఫీల్ అవుతోందంట. ఈ దెబ్బకు మరిన్ని చాన్సులు వస్తాయని తమన్నా ఆశిస్తోంది. ఇదిలా ఉండగా తమన్నా ప్ర‌స్తుతం మెగాస్టార్ మూవీ సైరాలో నటిస్తోంది. ఆ మూవీ రిలీజ్ కూడా ఈ ఏడాదే ఉంది. సో ఈ సంక్రాంతి తమన్నాకు మంచి రోజులే తెచ్చిపెట్టిందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: