తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి పండుగ సరదాలతో సంక్రాంతి ప్రారంభం అవుతుంది. భోగి రోజు చిన్నపిల్లలకు భోగిపండ్లు పోయడం కూడా సాంప్రదాయం. రేగుపండ్లు చెరకు ముక్కలు, బియ్యం నువ్వులు కలిపి చిల్లర నాణాలు అన్నీ కలిపి పిల్లలకు కొత్త బట్టలు వేసి తలపై నుండి భోగి పండ్లు పోస్తారు. ముత్తయిదువలతో పేరంటం పెట్టి వారి ఆశీర్వచనాలు పొందుతారు. భోగి పండుగను స్వాగతిస్తూ భోగి మంటలు వేయడంలో ఒక అంతరార్ధం ఉంది. మనుష్యులలోని అహం ఈర్ష్యా ద్వేషాలు ఈ భోగి మంటల సాక్షిగా దహించుకుపోయి అందరిలోనూ మంచి గుణాలు పెంపొందించాలి అన్న ఉద్దేశ్యంతో ఈ భోగి మంటలను వేస్తారు. చిన్న పిల్లలున్న ఇళ్లల్లో భోగినాడు పిల్లలకు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయిస్తారు. 
 పిల్లలకు భోగి పళ్ళను పోసే శుభ ఘడియలు:-
భోగభాగ్యాలను తెచ్చే పండుగగా భోగిపండుగను పరిగణిస్తారు. ధనరాశులు ఇంటికి చేరే వేళ భోగిపండుగ రోజున ఇంద్రునికి పూజ చేయాలి అని అంటారు. ధనుర్మాసదీక్ష పూర్తయిన దక్షిణాయనం చివరిరోజు ఈరోజు గోదాకళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణం చేసినా చేయించినా చూసినా దోషాలు పోతాయి. అంతేకాదు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని మన నమ్మకం. 
మకరరాశి ప్రవేశం ఎప్పుడంటే?
ముఖ్యంగా ముఖ్యంగా మహిళలకు మురిపించే ముగ్గుల పండుగ సంక్రాంతి. ఆ ముగ్గుల్లో గౌరమ్మలు అంటే గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తారు.  ఆ గౌరమ్మలపై బంతి పూల అలంకారాలు, అమ్మాయిల అందాల సందళ్ల ముగ్గుల ముత్యాల పందిళ్ల వాకిళ్లు. ఆడవారి కళా నైపుణ్యాన్ని తెలిపే అందమైన ముగ్గులతో కనిపించే అందమైన పండుగ సంక్రాంతి. 
 భోగి పండుగ విశిష్టత
ఈ సంక్రాంతి పండుగ అంతా హరిదాసుల హరినామస్మరణలు. గంగిరెద్దుల మేళతాళాలు. బుడుబుక్కుల గంటానాదాలతో తెల్లవారకముందే ప్రతి పల్లెలోని ఇల్లు హడావిడిగా కనిపిస్తుంది. ముగ్గును లక్ష్మీదేవి అంటారు. ఏ ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం.  మన సంస్కృతిలో ముగ్గుకెంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూప మైన అవతారమూర్తిగా కీర్తింబడిన గోదాదేవిని ఈరోజు పూజిస్తారు. సంక్రాంతి పండుగ పేరుకు మూడురోజుల పండుగ అయినా ఈ పండుగ హడావిడి వారం రోజుల ముందు నుంచే పల్లె ప్రాంతాలలో బాగా కనిపిస్తుంది. పిండి వంటల ఘుమఘుమలు మాత్రమే కాకుండా సంక్రాంతి కోడి పందేల పేరుతో గోదావరి జిల్లాలలో వందల కోట్లు ఈ సంక్రాంతి సందడిలో పందెం రూపంలో చేతులు మారిపోతాయి అంటే నష్టాలలో కూడ ఆనందాన్ని వెతికే సంస్కృతి గోదావరి జిల్లాలలో కనిపిస్తుంది. ఈ భోగి పండుగ ఆనందాలు అందరూ పొందాలని ఇండియన్ హెరాల్డ్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: