బాలకృష్ణ సినిమాల కెరియర్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది అని ఆశపడ్డ ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 ‘కథానాయకుడు’ కలక్షన్స్ విషయంలో చతికల పడటంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వాస్తవానికి ఈ సంక్రాంతి రేసుకు వచ్చిన అన్ని సినిమాలలోకి కథానాయకుడు కి మొదటిరోజు నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. 

మీడియా రివ్యూలు కూడ మంచి రేటింగ్స్ ఇస్తూ ఈసినిమాను ప్రోత్సహించాయి. అయితే ఈసినిమా కలక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఈమూవీ బయ్యర్లకు సుమారు 60 శాతం నష్టాలు వస్తాయి అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈభారీ నష్టాల నుండి ఆదుకోమని బయ్యర్లు బాలయ్య వైపు చూస్తున్నట్లు టాక్. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏవర్గం నుండి నెగిటివ్ ప్రచారం ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి వచ్చిన నష్టాల నివారణకు మాష్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
షాకింగ్.. ’ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు‘ విడుదల తేదీ వాయిదా..?
ఫిబ్రవరి మొదటివారంలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 ‘మహానాయకుడు’ మూవీని ‘కథానాయకుడు’ తో నష్టపోయిన బయ్యర్లకు ఉచితంగా ఇచ్చి వారి నష్టాలకు సహాయపడాలని బాలయ్య రాయబారాలు జరుపుతున్నట్లు టాక్. అయితే ‘కథానాయకుడు’ ఫ్లాప్ అయిన నేపధ్యంలో ‘మహానాయకుడు’ కు క్రేజ్ ఉండదని అందువల్ల తమ ఆర్ధిక నష్టాలకు సహాయంగా ఎంతోకొంత డబ్బు సహాయం చేయమని బాలకృష్ణకు క్రిష్ ద్వారా రాయబారాలు పంపుతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు కూడ పక్కకు పెట్టి ప్రస్తుతం ‘మహానాయకుడు’ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏమాత్రం వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకుండా చాల జాగ్రత్తగా తీస్తున్న ‘మహానాయకుడు’ కూడ ఫెయిల్ అయ్యే ఆస్కారం ఉందని అప్పుడే ఈమూవీ విడుదల కాకుండానే నెగిటివ్ ప్రచారం మొదలైంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: