ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను బ‌య్య‌ర్ల‌కు "ఉచితం" గా ఇచ్చేస్తున్నారా? నిజమో? కాదో? కొద్దిరోజుల్లో తేలిపోతుంది.  ప్రజావిశ్వాసం కోల్పొతే క‌థానాయ‌కుడైనా, మ‌హానాయ‌కుడైనా కాణికి కూడా కొరగాడు కారణాలేవైనా, ఒక వర్గం మీడియా ఎంతగా ప్రచారం చేసినా ప్రజాభిప్రాయం అనుకూలం గా లేనప్పుడు మన కథ కంచికి మనం ఇంటికి అన్నది ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం క‌థానాయ‌కుడు, సినిమా వసూళ్ళ విషయంలో ఋజువైంది, హాస్యాస్పదంగా మారింది కూడా!
NTR Biopic losses కోసం చిత్ర ఫలితం
ఎంత గొప్ప విశ్వవిఖ్యాత నట సార్వభుముడైనా జీవితం జయాపజయాల సమాహరమే. అది ఎవరూ కాదన లేని సత్యం. అలాంటిది ఆయన జీవితం విజయాలబాటని ఆయనొక దైవస్వరూపమ ని ప్రచారం చేయటానికి ఈ సినిమా ద్వారా విశ్వప్రయత్నం చేశారు. అయితే ఆయన జీవితం తెరచిన పుస్తకం. తల్లిదండ్రుల ద్వారా ఈ తరం పిల్లలందరికి ఆయన గురించి తెలుసు. సమాజ పరంగా ఆయన ఒక రాజకీయపక్షానికి చెందటంతో, నటుడుగా ఆయన్ని ఆరాధ్య నటుడుగా గౌరవించినా,  వ్యక్తిగా ఆయన పై కొంత వ్యతిరెఖత ఉంది. ఎంతైనా ఆయనపై పిసినారి, అసూయ పరుడు, అహంకారి, బందుప్రీతి ఇంకా ఎన్నో ఆరోపణలూ ఉన్నాయి. వెన్నుపోటుకు గురైన సానుభూతి మాత్రం చెక్కు చెదరలేదు అలాగే అది చిరస్మరణీయం. తెలుగువారి చరిత్రలో అదోక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.   .     
 NTR Biopic losses కోసం చిత్ర ఫలితం 
అందుకే ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాకు ఊహించిన విజ‌యం ద‌క్క‌డం అసాధ్యం.  ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం భారీన‌ష్టాలు తీసుకొచ్చేలా ఉంది. ₹ 72 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో కేవ‌లం ₹ 15 కోట్లు షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది.  ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టం జరగాలంటే ఏదో అద్భుతం జ‌ర‌గా ల్సిందే. న‌ష్టాలు కూడా భారీ గానే వ‌స్తాయ‌ని భవిష్య‌త్తు చూస్తుంటేనే అర్థ‌ మైపోతుంది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్ర‌భావం ఇప్పుడు ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు పై కూడా ప‌డుతుంద‌ని బ‌య్య‌ర్ల‌కు తెలుసు.
Box office collections of NTR Biopic కోసం చిత్ర ఫలితం
దాంతో ప‌రిస్థితులు ఎలా ఉండ‌బోతున్నాయో? అనే ఆస‌క్తి ఇప్ప‌ట్నుంచే అంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ మొద‌లైంది. ఈ స‌మ‌యంలో ఎన్టీఆర్ యూనిట్, నిర్మాత బాల‌య్య ఒక  సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ‘ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు’ సినిమాను బ‌య్య‌ర్ల‌కు ఫ్రీ గా ఇచ్చేస్తున్నార‌నే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.  అయితే విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా  (వస్తే)  తీసుకోవాల‌నేది నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందంలా క‌నిపిస్తుంది. దీనికి క్రిష్ కూడా ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.


ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ప్లెయిన్ ఫిల్మ్, ముఖ్యంగా తెలుగువారందరూ అభిమానించే కథానాయకుని నటజీవితం మాత్రమే.  కథలో ఎన్ని అడ్జెక్టివ్ లు, ఏడ్వర్బ్ లు ఉన్నా,  వివాదాలున్నా     "చౌచౌ" గా  నడుస్తుంది. కాని ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు వివాదాలమయం. ఇక్కడా ఎన్టీఆర్ ఒక మహనీయ రాజకీయనాయకుడుగా చూపే ఆస్కారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి హయాం లో టిడిపి తన ప్రజల్లో క్రెడిబిలిటీ పూర్తిగా కోల్పోయింది. ఒకవేళ జగన్ పై హత్యాప్రయత్నం, సిబీఐ నో ఎంట్రీ ని  గాని టిడిపి నాయకుల దుర్మార్గాలను వ్యతిరెఖ పక్షాలు పట్టు దలతో ఫోకస్ చెస్తే మాత్రం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు కూడా బ్రతికి బట్టకట్టడం అసాధ్యమే


దీనికి తోడు ఈ సినిమా కీలక పాత్రధారి కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి అవసానదశలో కుటుంబంతో సహా ప్రవర్తించిన ఆయనపట్ల చూపిన దమన దయనీయ పర్వం తీరు ను తెలిసిన వారెవరూ ఙ్జప్తికి తెచ్చుకోకమానరు క్షమించరు. అలాగే నందమూరి బాలకృష్ణ వివిధ సందర్భాలలో స్త్రీలపై చేసిన విచ్చలవిడి వ్యాఖ్యలు మహిళా లోకం ఏమాత్రం క్షమించదు. అందుకే వెరే నటులెవరైనా కీలక పాత్రలో నటించి ఉంటే సినిమా విజయం నిశ్చయమై ఉండేది.
NTR Biopic losses కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ప్రజలు ఎన్టీఆర్ మరణంపై స్పష్టమైన అవగాహనకు వచ్చారు. మొత్తం కుటుంబం ననదమూరి తారక రాముణ్ణి వృద్ధాప్యంలో దూరంలోపెట్టి ఆయన బాగోగులు చూసుకోకపోవటం వలననే ఆయన వృద్ధాప్యం చివరిదశలో తోడు కోసం ఆరాటపడటంలో తప్పులేదని,  అలాగే ఆ సమయాన్ని లక్ష్మి పార్వతి సద్వినియోగం చేసుకోవటం కూడా తప్పుగాదని తలుస్తున్నారు. అంతే కాదు నారా చంద్రబాబు నాయకత్వంలో నందమూరి కుటుంబం మొత్తం వెన్నుపోటులో బాగస్వాములేనని నిర్ధారణకు రావటం ఇక్కడ క్లైమాక్స్. 
 

ఇంకా వివాదాల నేపధ్యంలో నాదేళ్ళ భాస్కరరావు వ్యవహారం న్యాయస్థానాల వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.  అన్నింటిని మించి పురుగు మీద పుట్రలా రాం గోపాల్ వర్మ "లక్షీస్ ఎన్ టీఆర్ " ఎంతదెబ్బ కొడుతుందో చెప్పలేము. ఇన్ని అవరోధాలు దాటి సినిమా నిలబడుతుందా? అనేది ప్రశ్నార్ధకమే! 
సంబంధిత చిత్రం    

మరింత సమాచారం తెలుసుకోండి: