ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తున్న పరిస్థుతులలో కౌశల్ ప్రధానపాత్రగా పవన్ కళ్యాణ్ బయోపిక్ రాబోతోంది అన్న వార్తలు పవన్ అభిమానుల సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈవార్తలు ఇలా రావడం వెనుక ఒక కారణం ఉంది. ‘సేనాని’ పేరుతో ఒక బయోపిక్ మూవీ టైటిల్ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ కావడంతో ఈ గాసిప్పుల హడావిడి మొదలైంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండే ఒక నిర్మాత నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమూవీ వెనుక మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడ ఉంది అని వార్తలు వస్తున్నాయి. పవన్ వ్యక్తిత్వం ఆలోచనలు ‘జనసేన’ పార్టీ పెట్టడానికి గల కారణాలను వివరిస్తూ బ్యాక్ డ్రాప్ లో పవన్ సినిమాల ప్రస్తావన కూడ ఉంటుందని తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా గుర్తింపు పొందడమే కాకుండా ‘బిగ్ బాస్ 2’ విన్నర్ గా లక్షల స్థాయిలో అభిమానులు కలిగిన కౌశల్ ఈమూవీలోని పవన్ పాత్రకు అన్నివిధాల సరిపోతాడు అన్న ఆలోచనలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కౌశల్ ఆర్మీ పేరుతో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్న కౌశల్ పవన్ పాత్రను పోషిస్తే ఈమూవీ చాలా సులువుగా జనంలోకి వెళ్ళిపోతుందని నిర్మాతల అభిప్రాయం. 

అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ‘జనసేన’ పార్టీని జనం మధ్యకు తీసుకువెళ్ళడానికి ఈ ప్రయోగం బాగా సహకరిస్తుంది అన్న ఆలోచనలలో నిర్మాతలు ఉన్నట్లు టాక్. అయితే మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈవార్తలు అనీ నిరాధారం అని కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజం అయితే బాగుండుని అని కలలు కంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: