బయోపిక్కులు ఇపుడు ఓ ట్రెండ్ గా మారాయి. ఉత్తరాదిలో దీని మీదనే చాలా సినిమాలు బతికేస్తున్నాయి. ఓ ప్రముఖుని జీవితాన్ని తీసుకుని సినిమా కధ చెప్పడం ద్వారా నాలుగు కాసులు వెనకేసుకుంటున్నారు. అయితే  బాలీవుడ్లో బయోపిక్కుల సక్సెస్ వెనక సీక్రేట్లుచాలా  ఉన్నాయి.


అక్కడ జనం పురాణాలు, చరిత్రలు అంటే బాగా ఇష్టపడతారు. అదే విధంగా వారికి పూర్వీకుల జీవితాల గురించి తెలుసుకోవడంపై అమితాసక్తి ఉంటుంది. అదే దక్షిణాదిన అయితే ఎక్కువగా డ్రామాలను ఇష్టపడతారు. ఇక్కడ మసాలా చాలా కావాలి. అందువల్లనే బాలీవుడ్లో వచ్చిన సక్సెస్ రేటు ఇక్కడ బయోపిక్కులకు రావడం లేదు. నిజానికి చరిత్ర‌లను సినిమాలుగా తీయడంలో టాలీవుడు ఎపుడూ ముందు భాగానే ఉంది.


అన్న నందమూరి అలాంటి చిత్రాలను ఎన్నో తీసి అలరించారు కూడా. వాటికి మంచి విజయాలు లభించాయి. అయితే తరం మారింది. ఇప్పటి జనం చరిత్ర‌ చెప్పకు అంటోంది. వారికి కావాల్సిందల్లా పూర్తి ఎంటర్టైన్మెంట్. దాన్ని జోడిస్తూ బయోపిక్ తీయడం అంటే కత్తి మీద సాముతో వ్యవహారమే. నిజాయతీగా కధ చెప్పాలనుకున్నా కూడా అది డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే బయోపిక్కులను ముట్టుకొవడం అంటే సాహసమే అంటారు తలపండిన తెలుగు సినిమా ప్రముఖులు.


తెలుగులో గతంలో వచ్చిన కొన్ని బయోపిక్కుల్లో పూర్తిగా అప్పట్లో ఏదైతే ఉందో అది చూపించి  తీసారు. అంతే అవి జనం పట్టించుకోలేదు. సినిమాగా లేదని తిప్పికొట్టారు. ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి మీద స్వయంగా అయాన మనవడు సినిమా తీస్తే జనం ఆదరించలేదు. ఇక అల్లూరి సీతారామరాజు సినిమా విషయలో అన్న నందమూరి తీయాలనుకుని డ్రై సబ్జెక్ట్ అని పక్కన పెడితే క్రిష్ణ తీసి హిట్ కొట్టారు. అయితే అల్లూరి ఎలా చ‌నిపోయారన్న దాని మీద ఇందులోనూ భిన్న వాదలను వినిపించాయి.


కళ్ళ ముందు నిన్నటి వరకూ కదలాడిన వారిపై బయోపిక్కులు తీయడం అత్యంత సాహసం. వారి జీవితాల గురించి జనాలకు ఓ అభిప్రాయం ఉంటుంది. వాటిని ఏ మాత్రం భిన్నగా మార్చినా జనాలు చూడరు. ఇక ఈ తరం వారికి చరిత్ర  తెలుసుకోవాలని పెద్దగా ఆసక్తి లేదన్నది కూడా ఈ మూవీల ఫలితాలను చూస్తే అర్ధమవుతుంది. వినోదం చొప్పించి తీయాలనుకుంటే  అసలుకే ఎసరు వస్తుంది. మొత్తం మీద బయోపిక్కులు సౌత్ కి మరీ ముఖ్యంగా టాలీవుడ్ కి ఏ మాత్రం సరిపడవని గతంలో ఫెయిల్ అయిన అనేక చిత్రాలు రుజువు చేశాయి. అయినా ఈ ట్రెండ్ ఇపుడు జోరుగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: