ఎఫ్‌ 2.. ఫన్ అండ్ ఫస్ట్రేషన్‌ గా సంక్రాంతి వేళ తెరకెక్కిన ఈ చిత్రం అసలైన పందెం కోడిగా విజేతగా నిలచింది. విడుదలైన మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగువారికి పెద్ద పండుగ వేళ హాస్యపు జల్లులు కురిపిస్తూ ధియేటర్లలో నవ్వుల సంక్రాంతిని ఆవిష్కరిస్తోంది.

Image result for f2 movie images


ఈ సినిమా షూటింగ్ వివరాలను మీడియాతో పంచుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన వెంకటేష్ పెట్టిన షరతు దర్శకుడు అనిల్‌ను అవాక్కయ్యేలా చేసిందట. వరుణ్‌ కు తోడల్లుడుగా తాను నటిస్తున్నా.. తన వయస్సు తెలిసేలా కొన్ని సీన్లు రాసుకోమని వెంకటేశ్ సలహా ఇచ్చాడట.

Related image


వెంకటేశ్ కోరిక విని అనిల్ అవాక్కయ్యాడట. సాధారణంగా హీరోలు తమ వయస్సు తక్కువగా చూపించాలని కోరుకుంటారు. కానీ వెంకటేశ్ మాత్రం ఇందుకు భిన్నంగా కోరడం అతడిని ఆశ్చర్యపరిచిందట. ఇక వరుణ్ మాత్రం తన పాత్ర చిత్రణలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడట.

Related image


వరుసగా మూడు యాక్షన్ సినిమాలు చేసిన అనిల్ రావిపూడికి కామెడీ సినిమా చేయాలనిపించి ఈ సినిమా చేశాడట. ఈ సినిమా స్టోరీని వెంకటేశ్, వరుణ్‌లను మనసులో ఉంచుకునే రూపొందించాడట. ఆరోగ్యకరమైన వినోదం పండించడంలో తనకు జంధ్యాల, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి స్ఫూర్తిగా నిలుస్తారంటున్నాడీ కుర్ర డైరెక్టర్. అంతేగా..అంతేగా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: