ఎన్టీఆర్ కథనాయకుడు ఎబౌ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మరి మహానాయకుడు ఎలా ఉంటుంది. ఎన్టీఆర్ జీవితంలో అసలు సిసలు కీలకమైన ఎపిసోడ్స్ అన్నీ సెకండ్ పార్ట్‌లోనే ఉన్నాయి. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టిన తర్వాతే అనేక మలుపులు తిరిగింది.

Image result for ntr mahanayakudu


మరి మహానాయకుడు సినిమాలో ఈ ఇంట్రస్టింగ్ అంశాలన్నీ ఉంటాయా.. లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా.. వైస్రాయ్ ఎపిసోడ్‌ను ఎలా చూపిస్తారు.. ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. వీటిపై ఆ చిత్ర దర్శకుడు క్రిష్ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

Related image


ఎన్టీఆర్ జీవిత కథలో విలన్స్ అంటూ ఎవరూ ఉండరని.. అప్పటి కాలమే విలన్ గా ఉందని క్రిష్ అంటున్నారు. వైస్రాయ్ ఘటన ఉంటుందా అని అడిగితే దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పనని..అది చెబితే తన సినిమాకు ఎవరూ రారని క్రిష్ అన్నారు

Image result for ntr mahanayakudu krish


అసలు లక్ష్మీపార్వతి పాత్ర ఉంటుందా.. అని సూటిగా అడిగితే..అది కూడా చెప్పనని.. అది చెప్పేందుకు ఇది వేదిక కాదు.. సమయం కాదు అంటూ సున్నితంగా తిరస్కరించారు క్రిష్పోనీ మీ సినిమా ఎన్టీఆర్‌ జీవితాన్ని సమగ్రంగా చూపిస్తుందా..అంటే తప్పకుండా చూపిస్తుందన్నారు క్రిష్. తాను చెప్పానుకున్న కథనే తాను చూపిస్తానని క్రిష్ అన్నారు. మరి అసలు విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందేనేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: