ఈ ఏడాది సంక్రాంతి భారీ సినిమాల రేస్ కు వచ్చిన మూడు భారీ సినిమాలకు సంబంధించి ఒక కామన్ సర్ప్రైజ్ ఉండటం విశేషం. ఈ సినిమాల్లో హీరోల పాత్రలకు వాళ్ల నిజ జీవిత పేర్లే ఉండటం విశేషంగా మారింది.  

ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కిన ‘కథానాయకుడు’ సినిమాలో ఆ పాత్రను చేసింది   బాలయ్యే అయినా చేసింది ఎన్టీఆర్ పాత్ర కాబట్టి హీరో పాత్రకు ఒరిజినల్ పేరున్నట్లే భావించాలి. ఇక మిగతా రెండు సినిమాల విషయానికి వస్తే 'వినయ విధేయ రామ' లో హీరో పాత్ర పేరు రామ్ కొణిదెల అన్న సంగతి టీజర్ చూసినప్పుడే మెగా అభిమానులకు తెలిసిపోయింది. 

ఈసినిమాలో తన సొంత పేరునే కాకుండా ఇంటిపేరును కూడ పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఇక సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన సినిమా 'ఎఫ్-2' లో ఇద్దరు హీరోలకు  సొంత పేర్లే పెట్టారు.  ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ తన షార్ట్ నేమ్ తో 'వెంకీ' గా కనిపించాడు. వరుణ్ తేజ్ పేరును వరుణ్ యాదవ్‌ గా పెట్టారు. ఇలా ఈసంక్రాంతి రేస్ కు విడుదలైన మూడు సినిమాల్లోనూ హీరోల పాత్రలకు వాళ్ల సొంత పేర్లే ఉండటం అరుదైన విషయంగా మారింది. 

అయితే సంక్రాంతి కోడి పందేలా రీతిగా జరిగిన ఈ రేస్ లో అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘కధానాయకుడు’ ‘వినయ విధేయ రామ’ లు ఫెయిల్ అయితే కేవలం 30 కోట్ల పెట్టుబడితో నిర్మింపబడ్డ ‘ఎఫ్ 2’ మూవీకి కి కలెక్షన్స్ సునామిలా వస్తూ  ఉండటం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: