మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా లాస్ట్ ఫ్రైడే ఈ మూవీ రిలీజ్ అవగా మొదటి షో నుండే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది.


కథలో దమ్ము లేకపోవడం.. బోయపాటి తరహా ఊర మాస్ అంశాలు ఎక్కువవడం వల్ల సినిమా చూసిన ఆడియెన్స్ పెదవి విరిచారు. అయితే ఈ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్టామినా చూపించేలా వసూళ్లు రాబడుతుంది. సంక్రాంతి పండుగ స్కూల్స్, కాలెజీలు సెలవులు ఇక వచ్చిందో సూపర్ హిట్ సినిమా అన్నట్టుగా వివిఆర్ చూసేస్తున్నారు ఆడియెన్స్.


మొదటి షో టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వివి ఆర్ కలక్షన్స్ ఉన్నాయి. తొలి వీకెండ్ కలక్షన్స్ వరల్డ్ వైడ్ గా 39.75 కోట్లు వసూళు చేసింది. ఏరియాల వారిగా వినయ విధేయ రామ 3 రోజుల కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 8.02 కోట్లు
సీడెడ్ : 8.29 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.40 కోట్లు
ఈస్ట్ : 2.50 కోట్లు
వెస్ట్ : 2.27  కోట్లు
కృష్ణా : 2.07 కోట్లు
గుంటూరు : 4.86 కోట్లు
నెల్లూరు : 1.98 కోట్లు
ఏపి/తెలంగాణ : 33.39 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 4.96 కోట్లు
ఓవర్సీస్ : 1.40 కోట్లు
వరల్డ్ వైడ్ : 39.75 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: