టాలీవుడ్ లో లేటెస్ట్ గా ఓ డైరక్టర్ హీరోయిన్ ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. టపాసుల్లాంటి సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంటున్న ఓ డైరక్టర్ తన లాస్ట్ మూవీలో హీరోయిన్ గా చేసిన భామతో క్లోజ్ గా ఉంటున్నాడట. ఆ సినిమా హిట్ అవడంతో ఆ వెంటనే మనోడి తర్వాత సినిమాకు ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.


అయితే సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చారు లేండి. ఈమధ్యనే వచ్చిన ఆ సినిమా కూడా హిట్ అవడంతో ఆ దర్శకుడు చాలా ఆనందంగా ఉన్నాడట. ఈ లక్ అంతా తన హీరోయిన్ వల్లే అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడట. అయితే ఆల్రెడీ ఆ డైరక్టర్ కు పెళ్లైంది. మరి పెళ్లైనా సరే హీరోయిన్ తో క్లోజ్ గా ఉండటం ఏంటో ఆయనకే తెలియాలి.


ఈమధ్య తరచు ఆ ఇద్దరు బయట కనిపించడం వల్ల ఈ డౌట్ రేజ్ అవుతుంది. ఒకవేళ ఈ డైరక్టర్ తన తర్వాత సినిమాకు ఈ హీరోయిన్ ను రిపీట్ చేస్తే మాత్రం కచ్చితంగా ఇద్దరి విషయం చాలా దూరం వెళ్లినట్టు అనుకోవచ్చు. ఇప్పటికే వారి క్లోజ్ నెస్ చూసి అందరు షాక్ అవుతున్నారు. హిట్లు వస్తున్నా స్టార్ డైరక్టర్ అయ్యేదాకా ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టకుండా ఉంటే ఆ డైరక్టర్ కు మంచిది.


ఇక హీరోయిన్ విషయానికొస్తే ఆమె అటు స్టార్ కాదు.. అలా అని చిన్న హీరోయిన్ కూడా కాదు వరుస సినిమాలు చేస్తూ వెళ్తుంది. సినిమాలైతే చేస్తుంది కాని అమ్మడికి హిట్టు మాత్రం అడపాదడపా అన్నట్టుగా ఉంది. ఫైనల్ గా డైరక్టర్ హీరోయిన్ అసలు నడుస్తున్న మ్యాటర్ ఏంటి.. వారిద్దరి ఎప్పుడు ఓపెన్ అవుతారు అన్నది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: