ఈరోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం. ఒక సంవత్సరంలో ఎన్నో సంక్రాంతులు ఉంటాయి వీటిలోని రెండు ముఖ్యమైనవి. వాటిలో ఒకటి మకర సంక్రాంతి రెండవది   వేసవి కాలం అయిన తరువాత  వచ్చే కర్క సంక్రాంతి. ఈరెండింటి మధ్య చాల     సంక్రాంతులు ఉన్నా ఈ  రెండిటికి మాత్రమె జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది.  

సూర్యుడు తన గమనంలో రాశి మారిన ప్రతిసారి దానిని సంక్రాంతి అనే అంటారు. ఈమార్పు కారణంగానే మన జీవితాలపాలన పోషణలు జరుగుతున్నాయని మనపెద్దల నమ్మకం. ఈరోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఈ మకరసంక్రాంతిని  'పంటల పండుగ' గా జరుపుకుంటాం. అయితే దీనికి ఖగోళ పరమైన ఆధ్యాత్మిక పరమైన అర్ధాలు కూడా ఉన్నాయి. ఒక నిర్దిష్ట యోగప్రక్రియ నుంచి ఈపండగ ఆవిర్భవించింది అనిఅంటారు.  

భూమి సూర్యుని చుట్టూ 27 నక్షత్రాలు లేదా 108 పాదాల పరిభ్రమణ పూర్తిచేసి కొత్త ఆవృతాన్ని మొదలు పెట్టటాన్ని సంక్రాంతి తెలియజేస్తుంది. సంక్రాంతికి మూలపదమైన 'శంకర' అనే పదం యొక్క అర్థం “కదలిక” ప్రాణం అంటే కదలిక గ్రహం కదులుతుంది కనుకే ఇది ప్రాణాన్ని పుట్టిస్తుంది. గ్రహచలనం లేకుండా ఉంటే దానికి ప్రాణాన్ని ఇచ్చే సామర్ధ్యం ఉండదు. అందువల్ల ఈ కదలికలో అన్ని జీవులకూ పాత్ర ఉంది. ఈ కదలికను గుర్తుచేసుకుంటూ వేదాంత సారాన్ని తెలియచేసే పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలు పెద్దపండుగ అని పిలుచుకునే పండుగరోజు  సంక్రాంతి. ఈపండుగ రోజుల్లో లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను బంధు మిత్రులతోను కళకళ లాడుతుంటాయి. ఈపండుగను కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా  మనదేశంలో వివిధ రాష్ట్రాల్లోవివిధ పేర్లతో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ పంజాబ్ లో లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అనే పేర్లతో ఈపండుగను జరుపుకుంటారు.
 
ఈపండుగను కేవలం మనదేశంలోనే కాకుండా మనపొరుగు దేశాలైన బర్మా నేపాల్ థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. అచ్చమైన తెలుగు పండుగగా పేరుగాంచిన ఈసంక్రాంతికి ఇంటిల్లపాది మిగతారోజులు ఎక్కడున్నాసరే ఈపండుగ సమయానికి అందరు ఇంటికి చేరుకుంటారు. పాకుండలు సకినాలు మిటాయిలు ఈపండుగకు ప్రత్యేకమైన వంటకాలు. వీటికితోడు పాయసం,గారెలు,బూరెలు మొదలైన పిండి వంటలు లేకుండా సంక్రాంతి భోజనాలు ఉండవు. ఇక ఈపండుగ రోజున  సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మలకొలవు ఏర్పాటుచేసే సాం ప్రదాయం మన తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. గంగిరెద్దులు కోలాటాలు గాలిపటాలు కోడి పందాల హడావిడితో కనువిందు చేసే సంక్రాంతి ఆనందాలను ప్రతి తెలుగువాడు ఆస్వాదించి తీరుతాడు. తెలుగు సంస్కృతికి చిరునామాగా నేడు జరుపుంటున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు వారందరికీ ఇండియన్ హెరాల్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: