బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్ కు సంక్రాంతి సందర్భంగా పెట్టిన టార్చర్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ అతిథి మర్యాదలకు ఎవరు తట్టుకోలేరు. ఆమధ్య ‘సాహో’ షూటింగ్ సందర్భంగా ప్రభాస్ శ్రద్దా కపూర్ ను తన ఇంటికి డిన్నర్ కు పిలిచి ఆమెకు రకరకాల వంటలతో ఆమెను సర్ప్రైజ్ చేయడమే కాకుండా అవన్నీ తినేవరకు ఆమెకు ప్రభాస్ పెట్టిన టార్చర్ కు సంబంధించిన విషయాలు ఆమె స్వయంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది. 
Prabhas' SPECIAL gesture for Saaho co - star Shraddha Kapoor will make you believe that he is a true gentleman!
ఇప్పుడు గతంలో ప్రభాస్ తనకు పెట్టిన టార్చర్ కు బదులు తీర్చుకోవాలని శ్రద్దా కపూర్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక లేటెస్ట్ ప్లాన్ వేసింది. మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ప్రసిద్ధిగాంచిన ‘తిల్ గుల్’ లడ్డూలను ప్రత్యేకంగా శ్రద్ధా కపూర్ చేయించి భారీ సైజ్ లో ఉండే ఆలడ్డూలకు సంబంధించిన పెద్దపెద్ద బాక్స్ లను పంపించి అవన్నీ సంక్రాంతి పండుగ అయ్యేలోపల తినేయమని శ్రద్ధా కపూర్ ప్రభాస్ కు పరీక్ష పెట్టింది. 
Saaho
ఈవిషయాన్ని శ్రద్ధా కపూర్ తన ఇన్ స్ట్రా గ్రామ్ లో ప్రభాస్ అభిమానులకు తెలిసేలా వివరిస్తూ ప్రభాస్ తాను పెట్టిన పరీక్షలో నెగ్గగలడా అంటూ జోక్ చేసింది. ఇప్పుడు శ్రద్దా చేసిన ఆకామెంట్ ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. దీనితో శ్రద్దా కపూర్ పంపిన స్వీట్ బాక్స్ ఫోటోలను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

‘సాహో’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న శ్రద్దా కపూర్ ఈమూవీ విజయం పై చాల ఆసలు పెట్టుకుంది. ఈసినిమా నిర్మాణంలో ఉండగానే ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాల అవకాశాలు వస్తూ ఉన్నా వాటి గురించి ఆమె స్పందించకుండా ‘సాహో’ విడుదల గురించి వెయిట్ చేస్తోంది అంటే ఆమెకు ఈమూవీ పై ఎంత నమ్మకం ఉందో అర్ధం అవుతుంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: