గోదావరి జిల్లాలలో తన ‘జనసేన’ పట్టుకోసం పవన్ కళ్యాణ్ ఎంతో శ్రద్ద వహిస్తూ రాబోతున్న ఎన్నికలలో ఎక్కువ సీట్లు ఈ ఉభయగోదావరి జిల్లాల నుండి గెలుపొందడానికి పవన్ భారీ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ కు నిన్న పశ్చమ గోదావరి జిల్లా పాలకొల్లులో లభించిన ఘన స్వాగతం పవన్ కళ్యాణ్ మ్యానియాను సూచిస్తోంది అంటూ వస్తున్న కామెంట్స్ పవన్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
అల్లు అర్జున్ మూవీస్
పైకి చెప్పకపోయినా ఇప్పటికి అల్లు అర్జున్ వ్యవహార శైలి పూర్తిగా పవన్ అభిమానులకు నచ్చదు అన్నది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి పరిస్థుతులలో నిన్న అల్లు అర్జున్ కు లభించిన స్వాగతం పై పవన్ అభిమానులలో చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా బన్నీ తన బంధువులను అందర్నీ కలుసుకోవడానికి తన సొంత ఊరైన పాలకొల్లు వెళ్ళాడు. 
ర్యాలీగా...
అల్లు అర్జున్ సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకొల్లు వస్తున్నాడని తెలుసుకుని వందల సంఖ్యలో అభిమానులు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడ అల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలకడమే కాకుండా అక్కడ నుండి బైక్ ర్యాలీతో బన్నీని ఫాలో అవుతూ నిర్వహించిన ర్యాలీ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఒక రాజకీయ నాయకుడి ర్యాలీని తలపింప చేసే విధంగా నిర్వహింపబడ్డ ఈర్యాలీ ఉద్దేశం ఏమిటి అన్న కోణంలో కామెంట్స్ వస్తున్నాయి.  
గ్రాండ్ వెల్‌కం...
అంతేకాదు ఈర్యాలీలో తన అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించిన అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఒక రాజకీయ నాయకుడి తీరును తలపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో అల్లు అర్జున్ నిర్వహించిన ఈర్యాలి పవన్ కళ్యాణ్ కోసమా లేదంటే తన ఇమేజ్ ని పెంచుకోవడం కోసమా అనే విషయమై ఆసక్తికర చర్చలు పవన్ అభిమానుల మధ్య జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: