2.ఓ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవని కారణం వల్ల ఏమాత్రం లేటు చేయకుండా తన తర్వాత సినిమా మొదలుపెట్టాడు శంకర్. కమల్ హాసన్ తో తన సూపర్ హిట్ సినిమా ఇండియన్ సీక్వల్ కు నాంధి పలికాడు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది.


ఇక ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మర్మకళ చూపిస్తున్న కమల్ పిక్ తో పోస్టర్ వచ్చింది. పోస్టర్ లో కమల్ ను క్లియర్ గా చూపించలేదు. రెండు దశాబ్ధాల క్రితం రిలీజైన ఇండియన్ సినిమా ఇన్నాళ్లకు సీక్వల్ రాబోతుంది. ఈ సినిమా సీక్వల్ మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


ఈ సినిమా మేకప్ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను వాడుతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో కొరియన్ బ్యూటీ బే సుజీ కూడా నటిస్తుందని కోలీవుడ్ టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఓకే అవగా కొరియన్ భామని సెలెక్ట్ చేశాడట శంకర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఇండియన్ ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


రోబో సూపర్ హిట్ అవగా ఆ సినిమాకు సీక్వల్ గా వచ్చిన 2.ఓ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇండియన్ 2 సినిమాకు బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఇండియన్ 2 అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా మరో ఇద్దరు హీరోలు శింభు, దుల్కర్ సల్మాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: