సంక్రాంతి భరిలో ఎన్నో అంచనాల నడుమున రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు జనాలు మెప్పు పొందలేదని చెప్పాలి. ఈ  కలెక్షన్స్ మరీ షాకింగ్ గా ఉన్నాయని చెప్పాలి. భయర్లు కు బ్రేక్ ఈవెన్ రావటం కష్టమని తెలిసిపోతుంది. అయితే ఎన్టీఆర్ రెండో భాగం ఇంకా రిలీజ్ కాలేదు. ఎన్టీఆర్‌ జీవితంలోని రెండవ భాగం గురించే ఎక్కువ మందికి ఆసక్తి. అలాంటిది దానిని వెనక్కి వుంచేసి కేవలం 'కథానాయకుడు' అంటూ సినిమా విశేషాలు, విశేషణాలతో నింపేసారు.


ఎన్టీఆర్ : ఆ తప్పులే సినిమా ను కొంపముంచాయా ...!

ఈ చిత్రానికి ఆదరణ సరిలేకపోవడంతో భారీ రేట్లకి విక్రయించిన ఈ చిత్రం దారుణమైన నష్టాలు చవిచూసే దిశగా సాగుతోంది. దీంతో ఇప్పుడు ఇంకా విడుదల కాని రెండవ భాగం గండంలో పడింది. మొదటి భాగానికే స్పందన లేకపోతే ఇక రెండవ భాగానికి ఏమి ఆదరణ వుంటుందనే భావన సర్వత్రా నెలకొంది. మొదటి భాగం ఘన విజయం సాధించినట్టయితే చిత్ర బృందం కూడా ఉత్సాహంగా మరో భాగాన్ని మార్కెట్‌ చేసేవారు.


ఎన్టీఆర్ : ఆ తప్పులే సినిమా ను కొంపముంచాయా ...!

కానీ ఇంతటి ఘోరమైన పరాజయం తర్వాత ఇక దానిని ఏమని ప్రమోట్‌ చేసుకుంటారు? ఇప్పటికే క్రిష్‌ ముఖంలో ఆ నిరాశా ఛాయలు కనిపిస్తున్నాయి. వేరే అవకాశాలని వదులుకుని మరీ ఎన్టీఆర్‌ జీవితాన్ని తెరకెక్కించాలని ఉత్సాహ పడిన క్రిష్‌ తనవంతుగా కష్టపడినా కానీ ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి ప్లాన్‌ చేసిన ఎన్టీఆర్‌: మహానాయకుడు అనుకున్న సమయానికే వస్తుందా లేక ఈ పరాజయం మరచిపోయేంత వరకు వేచి చూసి, కొత్త ప్రణాళికతో మళ్లీ ప్రమోట్‌ చేసుకుంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: