సినిమా అంటే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు, అది కూడా జీవితమే. జీవితంలో జరిగే ఎన్నో సంఘటనల నుంచి ప్రేరణ తీసుకుని సినిమా కధ తయారవుతుంది. అందువల్ల తమకు దగ్గరగా ఉన్న జీవితాన్ని సినిమా రూపంలో చూసి జనం అందులో అనుభూతి చెందుతారు. ఇపుడున్న పరిస్తితుల్లో అటువంటి కధా వస్తువులు కానీ, సినిమాలు కానీ ఉన్నాయా అంటే సమాధానం లేవు అనే వస్తుంది. ఎందుకంటే ఇప్పటి సినిమాలు ఆకాశంలో విహరిస్తున్నాయి. కధ కంచికి చేరి చాలా కాలమే అయింది


అప్పట్లో అంటే డెబ్బయి, ఎనభై దశకంలో సినిమాలు అంటే నిజ జీవితానికి దగ్గరగా ఉండేవి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను కధా వస్తువులుగా రూపొందిచుకుని సినిమాలు తీయడం జరిగేది. ఇక అప్పట్లో పల్లెటూళ్ళు, రైతుల సమస్యలు, కుటుంబ బాంధ్వవ్యాలు వంటివి ఎక్కువగా సినిమాల్లో పెట్టేవారు. రైతుల జీవితాలు, పంత చేతికి రావడం, ఊరంతా కలసి సంబరాలు చెసుకోవడం, పేద గొప్ప అన్న తేడా లేకుండా అంతా కలసి మెలసి ఉండడం వంటివి అప్పటి సినిమాలు.


ఇలాంటివి సంక్రాంతికి వస్తే జనం బాగా ఆదరించేవారు. కుటుంబం అంతా కలసి విందు చేసుకున్న తరువాత వినోదంగా ఇలాంటి సినిమాలకు వెళ్ళేవారు. అప్పట్లో సూపర్ స్టార్ క్రిష్ణ పాడి పంటలు, బంగారు భూమి వంటి సినిమాలను సంక్రాంతికి జనం ముందుకు తీసుకువచ్చి హిట్ కొట్టారు. శోభన్ బాబు సోగ్గాడుగా, కన్నవారి కలలు పండంటి జీవితం వంటి చిత్రాలతో వస్తే అక్కినేని చక్రధారి, ఏడంతస్తుల మేడ 
వంటి సినిమాలు అన్న నందమూరి దాన వీర శూర కర్ణ వంటి పౌరాణిక సినిమాలతో అలరించే వారు.


ఇక 90 దశకంలో  మెగస్టార్ హిట్లర్ గా వస్తే, బాలక్రిష్ణ పెద్దన్నయ్యగా వచ్చి సంక్రాంతి సరదా చేశారు. రాను రానూ సినిమాల పోకడ మారిపోతోంది. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఇంటిల్లి పాది చూసే సినిమాలు రావడం లెదంటే అతిశయోక్తి కాదు. కొట్టుకోవడం, చంపుకొవడమే సినిమా కధలుగా మారిపోయాయి. దాంతో జనం కూడా సినిమా వినోదాన్ని బాగా తగ్గించుకుంటున్నారు. ఏది ఏమైనా సినిమా అన్నది మన జీవితానికి బాగా దగ్గరగా ఉన్నది, అందువల్ల సినిమాను మనం అందంగా తయారుచేసుకుందాం, చూసుకుందామని ఇప్పటి దర్శక నిర్మాతలు కూడా మంచి ఆలోచన చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: