సంచలనాలు సృష్టిస్తుంది అని భావించిన ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ కలెక్షన్స్ విషయంలోఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితులను తాను ముందే ఊహించాను అంటూ ఈ మూవీకి మొదటగా దర్శకుడిగా పనిచేసిన తేజ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణ వ్యూహాత్మక పొరపాట్లు చేస్తున్నాడని తాను ముందుగానే బాలకృష్ణకు సలహాలు ఇచ్చినా ఆసలహాలను బాలయ్య పట్టించుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
నికర వసూళ్లు 16 కోట్లే
వాస్తవానికి ఎన్టీఆర్ యుక్త వయసులో ఉన్న పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేతకాని కాకుంటే శర్వానంద్ చేత కాని నటింపచేయమని సలహాలు ఇచ్చినా వాటిని బాలయ్య లెక్కచేయలేదని తేజ అప్పటి విషయాలను తన్న సన్నిహితుల వద్ద చెపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ‘కధానాయకుడు’ సినిమాలో బాలకృష్ణ పోషించిన ఎన్టీఆర్ కు సంబంధించిన వివిధ గెటప్ ల సంఖ్యకు సంబంధించి వాటి సంఖ్యను తగ్గించమని బాలకృష్ణకు సలహాలు ఇచ్చినా ఆ సలహాలను బాలయ్య పట్టించుకోలేదని తేజా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. 
  తొలివారాంతంలో
ఇది ఇలా ఉండగా ఈమూవీకి  వన్‌ సైడేడ్ గా పాజిటివ్ రివ్యూస్ వచ్చినా ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చినా ఈమూవీకి సంబంధించి కలక్షన్స్  రెండోరోజు నుంచి వసూళ్లు క్రమేపీ క్షీణించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తొలిరోజు కలెక్షన్లు చూసిన వారికి ఈమూవీ 100 కోట్లు సునాయసంగా దాటేయడం ఖాయమనే మాట వినిపించింది. అయితే అందుకు భిన్నంగా కలెక్షన్లు కనిపిస్తున్నాయి. 
 70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్
ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో దాదాపు 1000 స్క్రీన్లలో విడుదల చేసారు.   ఈసినిమాకు  ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక నెట్ కలక్ష్యన్స్ విషయానికి వస్తే ఆ ఫిగర్ 16 కోట్లకు దాటదు అని అంటున్నారు. దీనితో 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈమూవీ ప్రస్తుతం భారీ నష్టాల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈఅనుకొని రిజల్ట్ చూసి బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా తెలుగుదేశం క్రియాశీలక కార్యకర్తలు నాయకులు కూడ టెన్షన్ పడుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: