శంకర్ ‘2.0’ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసే విషయంలో అంచనానలను అందుకోలేకపోయినా శంకర్ తన భారీ సినిమాల నిర్మాణ విషయంలో ఏమాత్రం వెనుక అడుగు వేయడంలేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఒకనాటి బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ ‘భారతీయుడు’ కు సీక్వెల్ గా 'ఇండియన్ 2' తో రాబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 
ఆ స్టార్స్ కూడా..?
అవినీతికి వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈమూవీ సాగుతుంది అన్న సంకేతాలు శంకర్ ఈ ఫస్ట్ లుక్ ద్వారా ఇస్తున్నాడు. ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో జనవరి 18 నుంచి సినిమా ప్రారంభింస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ తమిళంతో పాటు తెలుగు హిందీలో విడుదల కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్ హాసన్ సేనాపతిగాకనిపిస్తున్నాడు. 
View image on Twitter
1996 లో వచ్చిన ‘భారతీయుడు సినిమాలో ప్రాచీన యుద్ధవిద్య మర్మకళను ప్రేక్షలకు కమల్ పాత్ర ద్వారా చూపించాడు.  అయితే ఈ సీక్వెల్ లోకూడా ఈ మర్మకళను ప్రధానంగా చూపించబోతున్నట్లు ఈ రోజు విడుదల అయిన  పోస్టర్ ను బట్టి తెలుస్తోంది ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో 2.0 చిత్రాన్ని నిర్మించి లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘ఇండియన్ 2' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.  
లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో
ఈ సినిమాకు కుడా 300 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం ఈచిత్రంలో కమల్ హసన్ తో పాటు  దుల్కర్ సల్మాన్ శింబులు కూడ  ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్లుతెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఒక రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్న పరిస్థితులలో ఈమూవీ ద్వార తన పొలిటికల్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని ఆశిస్తున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: