కోలీవుడ్ హీరో విషాల్ నిరంతరం సంచలన వార్తలకు చిరునామాగా ఉంటాడు. అయితే విషాల్ కుటుంబ మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు జిల్లాకు సంబంధించినవి. దీనితో తాను పుట్టి పెరిగింది చెన్నై అయినప్పటికీ తెలుగు ప్రజలతో తన సినిమాల ద్వారా సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నాడు విశాల్.
చూడముచ్చటైన జంట
రజినీకాంత్ కమలహాసన్ విజయ్ అజిత్ ల తరువాత తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయం అయిన పేరు విషాల్. అలాంటి ఫిలిం సెలెబ్రెటీ ఇప్పుడు తెలుగు ప్రజలతో తన సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి తన పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయంతో తెలుగువారికి మరింత దగ్గర కాబోతున్నాడు. 
విశాల్‌తో సెటిలవ్వడంపై సంతోషం
విశాల్ పెళ్ళికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈసారి తన పెళ్లి విషయంలో ఒక స్థిర నిర్ణయం తీసుకుని విశాల్ ఒక హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతు ఉండటం సంచలనంగా మారింది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆఅమ్మాయి పేరు ఆళ్ళ అనీషా రెడ్డి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ఈమె అని తెలుస్తోంది. 
సినిమాల్లో నటించిన అనీషా రెడ్డి
వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి ఆతరువాత పెద్దల అంగీకారంతో పెళ్ళిగా మారుతున్నట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరి పెళ్లి హైదరాబాద్ లోనే జరుగుతుందని టాక్. నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడ మారి సినిమాలు తీస్తున్న విషాల్ తన సినిమాల జయాపజయాల గురించి ఎప్పుడూ పట్టించుకోడు. ఇప్పుడు తెలుగువారి అల్లుడుగా విషాల్ మారబోతున్న నేపధ్యంలో తెలుగు ఇండస్ట్రీలో కూడ విషాల్ స్పీడ్ మరింత వేగంగా కొనసాగే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: