సాధారణంగా ఒక గొప్ప సినిమా విడుదల అయినప్పుడు ఆసినిమా జయా పజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ టాప్ హీరోలు దర్శకులు ఆసినిమా పై ప్రశంసలు కురిపించడం పరిపాటి. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి సంబంధించి ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచిన నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధంచిన బయోపిక్ విడుదల అయినప్పుడు ఆసినిమాను ప్రశంసిస్తూ ఇండస్ట్రీ ప్రముఖులు కనీసపు ప్రశంసలు అయినా కురిపిస్తారు. అయితే దీనికి భిన్నంగా ‘కథానాయకుడు’ మూవీ విషయంలో ఇండస్ట్రీ టాప్ హీరోలు వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిలు తమ అభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయడానికి కుదిరిన తీరిక కనీసం ఒక్క మంచిమాట ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ గురించి అనడానికి తీరిక లేదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చి బాలకృష్ణ పై విపరీతమైన ప్రశంసలు కురిపించిన జూనియర్ ఆతరువాత ఆసినిమా విడుదల అయ్యాక కనీసం ఆమూవీ గురించి సోషల్ మీడియాలోని తన ట్విటర్ లో కూడ ఎందుకు స్పందించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. 

చిన్నచిన్న సినిమాల పై కూడ ప్రశంసలు కురిపించే రాజమౌళి నుండి ఈమూవీ పై కనీసం ఒక్క ప్రశంస కూడ లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నందమూరి తారకరామారావుకు వీరాభిమానిగా చెప్పుకునే రాజమౌళి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇలా వ్యూహాత్మక మౌనం వహించడం చాలామందికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఇక ‘కథానాయకుడు’ మూవీలో అక్కినేని పాత్రకు ప్రాధాన్యతను ఇచ్చినా ఈమూవీ గురించి నాగార్జున ఒక్క మాట కూడ ఎందుకు మాట్లాడటం లేదు అని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. 

ఇది చాలదు అన్నట్లుగా వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఎప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే నాని నిఖిల్ లాంటి చాలమంది యంగ్ హీరోలు అసలు ‘కథానాయకుడు’ విడుదలైంది అన్న విషయం గుర్తించనంత పరిస్థుతులలో వీరంతా మౌనం వహించడం కారణం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి. ‘కథానాయకుడు’ మూవీలో పేరుకు బాలకృష్ణ నటించినా అది నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించిన సినిమా అన్న విషయం ఇండస్ట్రీ మర్చిపోయిందా అంటూ ప్రస్తుతం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: