తెలుగు సినిమాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు సినిమాల్లో గ్యాప్ బాగా పాటిస్తున్నాడు. గత ఏడాది నా పేరు సూర్య తరువాత మళ్ళీ ముఖానికి రంగు పూసుకోలేదు బన్నీ. తొందరలో త్రివిక్రం డైరెక్షన్లో మూవీ ఉంటుందని న్యూస్ వస్తోంది. ఈ లోగా సంక్రాంతి వాచ్చేసింది. బన్నీ ఈ పెద్ద పండుగను ఈసారి బాగా వైరైటీగా చేసుకున్నాడు. కుటుంబ సమేతంగా ఆయన తన సొంతూరు పాలకొల్లుకు వెళ్ళి హల్ చల్ చేశాడు. అభిమానులను సైతం అలరించాడు.


ఇకపైన తాను ప్రతీ ఏటా సొంతూరుకే వచ్చి సంక్రాంతి పండుగా చేసుకుంటానని బన్నీ చెప్పడం విశేషం. తాను పుట్టింది చెన్నైలోనైనా తన సొంత ఊరు మాత్రం  పాలకొల్లు అని గర్వంగా చెప్పిన బన్నీ తాను తన సొంత ఊరు అభివ్రుధ్ధికి ఎంతో చేయాలనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. పది లక్షలతో కళ్యాణ మండపాన్ని తన తాత అల్లు రామలింగయ్య పేరు మీద కట్టబోతున్న బన్నీ ఇకపైన మరింతగా పాలకొల్లు ప్రగతికి పాటుపడతానని హామీ ఇచ్చాడు. 


ఇదిలా ఉండగా బన్నీలో ఒక్కసారి పాలకొల్లు పట్ల ప్రేమ పెరగడం అభివ్రుధ్ధి కార్యక్రమాలు అంటూ ముందుకు రావడం పట్ల జోరుగా చర్చ సాగుతోంది. బన్నీ సామాజిక కార్యక్రమాలు చేపట్టడం వరకూ అందరూ అభినందిస్తున్నారు. బన్నీ రాబోయే  రోజుల్లో రాజకీయాల వైపు అడుగు పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే చిన మామయ్య పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఇంకా సినిమా కెరీర్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని,  తనలోని సామాజిక కోణం మాత్రం ఎపుడొ ఒకపుడు రాజకీయంగా మారదని మాత్రం చెప్పలేమని అంటున్నారు. మొత్తానికి బన్నీ రావడంతో పాలకొల్లుకు కొత్త సంక్రాంతి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: