మహేష్ అంటేనే అందగాడు. క్రిష్ణ తరువాత అంతటి అందాన్ని కంటిన్యూ చేస్తూ మిల్కీ బ్యూటీలకే జలసీ కలిగేలా చేస్తున్నాడు. దాంతోనే  మహేష్ సినిమాలకు  ఓ ప్రాబ్లం వచ్చిపడుతోంది. ఆయన పక్కన ఎంతటి బ్యూటీని పెట్టినా తేలిపోతున్నారు. మహేష్ పక్కన పెద్దగా ఆనడంలేదు. దాంతో ఇంటెలెక్చువల్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ కొత్త ప్లాన్ వేశారట.


ఈసారి మహేష్ పక్కన ఓ హాటీ బ్యూటీని సెలెక్ట్ చేశారని అంటున్నారు. బాలీవుడ్ కే సెగలు పొగలు పుట్టిస్తున్న కత్తి లాంటి ఫిగర్ కత్రినా కైఫ్ ని మహెష్ కి జోడీగా చేయించాలని సుక్కూ డిసైడ్ అయ్యాడట. మహేష్ పొడగరి, ఆయన పక్కన కత్రినా కూడా సొగసరిగా మెరుస్తుందని ఈ జంట కన్నుల పంటగా ఉంటుందని సుకుమార్ ఏ రేజిలో ఫిక్స్ అయిపోయాడట.


ప్రస్తుతం మహేష్ మహర్షి మూవీతో బిజీగా ఉన్నాడు. అది అయిపోగానే సుక్కూ మూవీకి రెడీ అవుతున్నాడు. మరి కత్రినా తో స్టెప్పులేసేందుకు హాండ్సం మహేష్ ఒకే అన్న మాట. ఇక కత్రినా అంటేనే మల్లీశ్వరి గుర్తుకువస్తుంది. అందులో ఆమె అందం, నటన ఇప్పటికీ కట్టి పడేస్తాయి. ఈ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తరువాత బాలయ్యతో అల్లరి పిడుగు మూవీలో కూడా యాక్ట్ చేసింది. మహేష్ మూవీలో కనుక మెరిస్తే ఆమె మళ్ళీ తెలుగు జనాలకు చాన్నాళ్ళకు హలో అన్నట్లవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: