భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన హీరో కమల్ హాసన్.  సినీ ఇండస్ట్రీలో కమల్ నటించిన కొన్ని పాత్రల్లో నటించడానికి ఎవరూ సాహసించలేదు.  అయితే కమల్ తర్వాత ఆ తరహా ప్రయోగాత్మక పాత్రల్లో విక్రమ్ నటించి మెప్పించారు.  విక్రమ్ నటించిన ‘ఐ’చిత్రం ఇందుకు నిదర్శనం.  ఇక విశ్వనటుడు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుంది.  కాకపోతే వీరిద్దరూ కలిసి కాదు..విక్రమ్ నటిస్తున్న చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నారు.
Image result for ‘కదరం కొండమ్‌’
విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కదరం కొండన్‌’. రాజేశ్ ఎమ్‌. సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్ ‌హాసన్‌ నిర్మిస్తున్నారు. అక్షరా హాసన్‌ కథానాయిక. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు.  ఈ టీజర్‌లో విక్రమ్‌ తెలివైన దొంగ, స్మగ్లర్‌ గా కనిపించారు. 

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నాజర్‌ కుమారుడు అభిహాసన్‌ నటుడిగా పరిచయం కాబోతున్నారు.  ఈ చిత్రాన్ని గతంలో కమల్ హాసన్‌తో ‘చీకటి రాజ్యం’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాజేస్ ఎం సెల్వ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ టీజర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ జేమ్స్ బాండ్ మూవీ తరహాలో తెరకెక్కించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: