రకుల్ ప్రీత్‌ సింగ్.. నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.. కానీ పాపం.. ఎందుచేతనో ఇటీవల ఈ అమ్మడికి తెలుగులో సినిమాలు చాలా తగ్గిపోయాయి. 2018లో రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు పాపం.

Related image


ఇటీవల విడుదలై ఎన్టీఆర్ కథానాయకుడులో శ్రీదేవిగా నటించి.. బాలయ్య సరసన చిందులేసింది. ఇటీవలి కాలంలో వచ్చిన రకుల్ సినిమా ఇదొక్కటే. అలాగని రకుల్‌కు డిమాండ్ లేదని అనుకోకండి. ప్రస్తుతం రకుల్ తమిళం, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Related image


మళ్లీ ఇప్పుడు రకుల్ ప్రీత్ కన్ను టాలీవుడ్ మీద పడింది. వెంకటేశ్ సరసన వెంకీ మామ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అంతేకాదు.. హీరో నితిన్ పక్కన కూడా నటించబోతోందని టాక్.

Related image


ఇవే కాదు.. మరికొన్ని సినిమాల గురించి కూడా చర్చలు నడుస్తున్నాయట. సో.. 2019లో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ విజృంభిస్తుందన్నమాట. ఈ ఏడాది రకుల్‌ కు మంచి హిట్స్ వచ్చి 2018 నష్టం భర్తీ కావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: