సోషల్ మీడియా ప్రభావం తో సెలెబ్రెటీస్ సైతం ఇబ్బంది ఎదుర్కోక తప్పటం లేదు. నెటిజన్స్ ఎప్పటికప్పుడు జులక్ ఇస్తున్నారు. ఇంటర్నెట్ లో టెన్ ఇయర్స్ ఛాలెంజ్ అని ఒకటి ట్రెండింగ్ లో ఉన్న విషయాన్ని నెటిజన్లు గమనిస్తూ ఉంటారు. పదేళ్ల కిందట, పదేళ్ల తర్వాత.. అంటూ అప్పటికి ఇప్పటికీ మార్పులేని విషయాలను, మార్పు ఉన్న విషయాలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అందుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. ఇందులో సెలబ్రిటీల భాగస్వామ్యం బాగానే ఉంది. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా  మారింది.

శ్రుతి హాసన్ అలా సెటైర్ల పాలైంది!

ఇందులో భాగస్వామి కాబోయి అనూహ్యంగా ట్రోల్ ను ఎదుర్కొంటోంది శ్రుతి హాసన్. నలుగురితో పాటు తనూ అన్నట్టుగా పదేళ్ల కిందట తన ఫొటోను, తన తాజా ఫొటోను కలిపి పోస్టుచేసింది శ్రుతి. దానికి ఒక క్యాప్షన్ కూడా జత చేసింది.‘పదేళ్లు గడిచిపోయాయా..’అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చింది. అయితే శ్రుతి సంభ్రమాశ్చర్యానికి నెటిజన్లు షాకులిచ్చారు.  ఆమె ఫేస్ లో తేడాలను ప్రస్తావిస్తూ.. ప్లాస్టిక్ సర్జరీస్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Image result for shruthi hasan

తన మొహంలో అందం కోసం శ్రుతి కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందనే ప్రచారం ఒకటి ఉంది. నోస్ సర్జరీ చేయించుకుందని ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ప్రచారం జరిగింది. అలాంటి సర్జరీలతో కమల్ తనయ అందంగా మారిందని అంటారు. ఇలాంటి నేపథ్యంలో ఈమె ముఖాకృతిలో చాలా మార్పులే కనిపిస్తుంటాయి. ఈ విషయాన్నే పట్టుకున్నారు ఈమె ఫాలోయర్లు. శ్రుతి ఫొటో కింద అలాంటి కామెంట్లే పెట్టారు. మిగతావాళ్ల సంగతేమో కానీ.. పదేళ్ల వ్యత్యాసాన్ని చూపించే క్రమంలో శ్రుతి ఇలా బుక్ అయ్యింది!

మరింత సమాచారం తెలుసుకోండి: