‘కథానాయకుడు’ ఫెయిల్యూర్ తో ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘మహానాయకుడు’ పరిస్థితి ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ పనులను బాలకృష్ణ క్రిష్ లు పూర్తి చేస్తున్నప్పటికీ ఈమూవీ మొదటిగా అనుకున్నట్లుగా ఫిబ్రవరి 7న విడుదల అవ్వకపోవచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. 
NTR Maha Nayakudu
తెలుస్తున్న సమాచారం మేరకు బాలయ్య ఇప్పటివరకు ‘మహానాయకుడు’ మూవీకి సంబంధించి తీసిన సన్నివేశాలను ప్రతిదానిని చాల లోతుగా చూస్తూ మరొకసారి తనకు పరాభవం రాకూడదు అన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం. అవసరం అనుకుంటే ఈమూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేద్దామని బాలకృష్ణ క్రిష్ కు సూచన ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ‘కథానాయకుడు’ సినిమాకు వచ్చిన ఫెయిల్యూర్ టాక్ తో కలవర పడుతున్న తెలుగుదేశం ముఖ్యనాయకులు కూడ ‘మహానాయకుడు’ రిలీజ్ విషయంలో ఖంగారు పడవద్దని సినిమా పూర్తిగా బాగా వచ్చిన తరువాత మాత్రమే రిలీజ్ చేయమని బాలకృష్ణకు సూచనలు ఇస్తున్నట్లు టాక్. దీనితో ఈమూవీ రిలీజ్ ఫిబ్రవరి నెలాఖరుకు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
NTR Mahanayakudu
అయితే ఫిబ్రవరి నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటింపబడుతున్న నేపధ్యంలో ఆవిషయం ‘కథానాయకుడు’ కి అడ్డుగా అయితే ఈమూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో బాలకృష్ణకే తెలియని పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత మసక బారి ‘కథానాయకుడు’ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఎవరు పట్టించుకోని స్థితికి చేరుకుంది అన్న  విశ్లేషణలు  కూడ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: