హీరోయిన్ స్నేహ సహ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. స్నేహ తెలుగు, తమిళం సహా దక్షిణాది భాషల్లో సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. హోమ్లీ లుక్ తో విజయవంతమైన హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది.

Related image


తానేమో సక్సస్ ఫుల్ హీరోయిన్.. ప్రేమించింది సాటి హీరోని.. అందులోనూ హోమ్లీ నటిగా గుర్తింపు. అయినా కూడా స్నేహ లవ్ స్టోరీ అంత సులభంగా పెళ్లి పీటలెక్కలేదట. స్నేహ ఇంట్లో కాస్త సులభంగానే పెళ్లికి అంగీకరించారట. కానీ ప్రసన్న ఫ్యామిలీ మాత్రం ససేమిరా అంటూ మొండికేసిందిట.

Image result for heroine sneha family


ఐతే.. ప్రసన్న మాత్రం స్నేహను వదులుకునేందుకు ఇష్టపడలేదు. ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ స్నేహను పెళ్లి చేసుకున్నాడు. ఓ ఏడాది వరకూ ప్రసన్న ఇంట్లో స్నేహతో పెళ్లి విషయమై గొడవలు జరిగాయట. కానీ స్నేహ దంపతులు మాత్రం అన్నింటినీ ఓపికగా భరించారట.

Image result for heroine sneha family


ఆ తర్వాత క్రమంగా ప్రసన్న ఇంటివారు కూడా ఈ దంపతులకు దగ్గరయ్యారట. ఇప్పుడు స్నేహ కొడుకు విహాన్‌కు నాలుగేళ్లు. ప్రసవం తర్వాత స్నేహ బరువు పెరిగిందట. కానీ భర్త ప్రసన్నట్రైనింగ్ తో మూడు నెలల్లోనే ఏడు కేజీలు బరువు తగ్గిందట. ఇవీ స్నేహ ప్రేమ పెళ్లి ముచ్చట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: