తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో బాలయ్య స్టైల్ వేరు. ఆయన ఎన‌ర్జీ లెవెల్స్ కూడా వేరు. ఆయన ఇప్పటికి వంద సినిమాలు పూర్తి చేసినా ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడుతూనే ఉంటారు. గత మూడేళ్ళ నుంచి ఆయన వరసగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేస్తున్నే ఉన్నారంటే బాలయ్య పక్కా  ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్ధమవుతుంది.


ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టడంలో బాలయ్యకు సాటి ఎవరూ రారు. అలాగే ఓ సినిమాపై ఏళ్ళకు ఏళ్ళు వర్క్ చేయడం కూడా బాలయ్య వల్లకాదు. సినిమాని అనుకున్న టైంలో తీసి రిలీజ్ కొట్టడంతో బాలయ్యకు పేరుంది. ఇదంతా ఎందుకంటే బాలయ్య ఇపుడు కధానాయకుడు మూవీని చేసి మహానాయకుడు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నారు. ఆ మూవీ తరువాత ఆయన చేయబోయే ప్రాజెక్టుల మీద కూడా అపుడే న్యూస్ వస్తోంది. కధానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే డైరెక్టర్ బోయపాటి తో మూవీని అనౌన్స్ చేసిన బాలయ్య ఇపుడు మరో న్యూస్ కూడా చెప్పబోతున్నారు.


ఒకేసారి ఇద్ద‌రు మాస్ డైరెక్టర్లతో బాలయ్య వర్క్ చేయబోతున్నారన్నదే ఆ న్యూస్. ఒకరు వీవీ వినాయక్. మరొకరు బోయపాటి శ్రీను. ఈ ఇద్దరు బాలయ్యతో సినిమాలు ఇపుడు ఒకే టైంలో చేస్తారుట. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ ఈ ఇద్దరి మూవీస్ ఫినిష్ చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యారని టాక్. బోయపాటితో మూవీని బాలయ్య సొంత బ్యానర్లో నిర్మిస్తారని, వినాయక్ మూవీని కళ్యాణ్ నిర్మాతగా తీస్తారని తెలుస్తోంది. ఇలా రెండు మూవీస్ లో ఒకే టైంలో వర్క్ చేతూ ఫినిష్ చేయడం రేర్ ఫీట్. అది బాలయ్యకే చెల్లు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: