తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు సంచలనాల చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు మురగదాస్.  ఆయన తీసే ప్రతి చిత్రంలో ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఉంటుంది.  ఆ మద్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మురగదాస్ తెలుగు లో మహేష్ బాబు తో తీసిన ‘స్పైడర్’ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  కానీ ఈ చిత్రం అంచనాలు అందుకోలేక పోయింది.
Image result for mahesh babu spyder
ఆ తర్వాత తమిళ హీరో విజయ్ తో ‘సర్కార్’ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అంతే కాదు మురగదాస్ పై కేసు కూడా నమోదు చేశారు. అన్ని వివాదాలు వచ్చినా..ఈ చిత్రం కలెక్ష పరంగా బాగా దూసుకు వెళ్లింది.   ప్రస్తుతం మురుగదాస్ కొత్త సినిమా ఏంటనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
Image result for sarkar movie
అయితే సంక్రాంతి సందర్భంగా మురుగదాస్ తన కొత్త మూవీ టైటిల్ ను ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ చిత్రం పేరు ‘నార్కాలి’అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మురుగదాస్ తన ట్విట్టర్ లో స్పందించారు. నార్కాలి' నా కొత్త సినిమా టైటిల్ కాదు. పుకార్లు సృష్టించడం ఆపేయండని ట్వీట్ చేశాడు. మురుగదాస్ కొత్త సినిమా ఎవరితో తీస్తాడు..ఎపుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయాలు తెలియాలంటే..కొంత కాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: