సోషల్ మీడియా లో కొన్ని సార్లు సెలెబ్రెటీస్ కు నెటిజన్స్ కు వార్ జరుగుతుంటుంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత జుగుస్సా కరమైన కామెంట్స్ కు హద్దు అదుపు లేకుండా పోయింది. సెలెబ్రెటీస్ కూడా సంయమనం పాటించక పోవడంతో ఆ వార్ ఇంకా చెండాలంగా తయారవుతుంది. అయితే  అసలు విషయమేంటంటే, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి సంబంధించిన ఫొటోకి ఓ 'ఔత్సాహికుడు' చేసిన కామెంట్‌, ఆమెకు ఒళ్ళు మండేలా చేసింది. ఆ ఫొటోలో రకుల్‌, షార్ట్‌ నిక్కర్‌తో కారు దిగుతూ కన్పించింది. 'కారులో సెషన్‌.. ప్యాంట్‌ మర్చిపోయిన రకుల్‌' అన్నది ఆ కామెంట్‌ సారాంశం.

పాపం రకుల్‌.. అడ్డంగా బుక్కయిపోయింది

రకుల్‌ ఆగ్రహంతో ఊగిపోతూ, సదరు పోస్ట్‌ చేసిన వ్యక్తి తల్లిని దూషించేసింది. 'మీ అమ్మ చాలా సెషన్స్‌ కారులో చేసి వుంటుంది..' అంటూ విరుచుకుపడిపోయింది రకుల్‌. దాంతో, నెటిజన్లు ఇప్పుడు రకుల్‌ని మరింత గట్టిగా ట్రాల్‌ చేసేస్తున్నారు. 'మధ్యలో వాళ్ళ అమ్మ ఏం చేసింది.? నువ్వు తిట్టాలనుకుంటే ఆ వ్యక్తిని తిట్టొచ్చు. లేదంటే, ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఓ మహిళ అయి వుండీ, ఇంకో మహిళపై ఇలాంటి జుగుప్సాకరమైన కామెంట్‌ ఎలా చేశావ్‌.?' అంటూ రకుల్‌ని కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.

Image result for rakul preet singh

తన ఉద్దేశ్యం ఇంకో మహిళను కించపర్చడం కానే కాదనీ, 'సిక్‌ మైండెడ్‌ పీపుల్‌'కి బుద్ధిరావాలనే అలాంటి కామెంట్‌ చేశానని రకుల్‌ వివరణ ఇచ్చుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే క్రమంలో శ్రీరెడ్డి సైతం ఇలాగే, పవన్ తల్లిపై నోరుజారేసి, వివాదాన్ని కొని తెచ్చుకున్న సంగతి తెల్సిందే. అన్నట్టు.. అప్పట్లో శ్రీరెడ్డి.. రెక్కపీత.. అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడాన్ని ఎలా మర్చిపోగలం.?

మరింత సమాచారం తెలుసుకోండి: