స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి రెండు భాగాల్లో ఒకటి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.  అయితే ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన మొదటి భాగం చాలా వరకు పాటలు, ఎక్కువ మంది తారలు ఉండటంతో కాస్త గజిబిజి అనిపించిందని పలువురు అభిప్రాయ పడ్డారు.  ఈ సినిమా కేవలం పాటలు, సన్నివేశాలతోనే నిండిపోయిందని అభిమానులు అంటున్నారు.  కలెక్షన్లు కూడా అనుకున్న స్థాయిలో రాబట్టలేక పోయింది. 
Image result for ntr mahanayakudu
ఇక ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వచ్చే నెల 7న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.  అయితే ఎన్టీఆర్ కథానాయకుడు ఎఫెక్ట్ తో సినిమా అభిమానుల అంచనాలకు చేరే విధంగా తీర్చి దిద్దబోతున్నారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోకపోవచ్చనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14వ తేదీకి విడుదలను వాయిదా వేశారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ నటనా జీవితం ఆవిష్కరిస్తే.. రెండో భాగంలో  ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం .. ఆ ప్రయాణంలో ఆయనకి ఎదురైన పరిస్థితులను ఈ భాగంలో చూపించనున్నారు.
Image result for ntr mahanayakudu
చంద్రబాబుగా రానా .. హరికృష్ణగా కల్యాణ్ రామ్ పాత్రలు పూర్తిస్థాయిలో కనిపించనున్నాయి.  ఈ  సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  ఎన్టీఆర్ కథానాయకుడు కన్నా 'మహానాయకుడు'లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ మరింత బాగా కుదిరారనే టాక్ వినిపిస్తుంది.  ఈ సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయబోతున్నారట. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: