సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయమైనా జనానికి ఇంట్రస్టే.. ఆ ఆసక్తినే క్యాష్‌ గా మార్చుకుంటున్నారు కొందరు నిర్మాతలు. సెలబ్రెటీల జీవితాల్లో మలుపులు, రహస్యాలకు సంబంధించిన కథలంటే ఇంకా ఆసక్తి ఎక్కువ. అందుకే ఇప్పుడు బయోపిక్‌ల కాలం నడుస్తోంది.

Image result for sridevi murder mystery

ఈ సమయంలో శ్రీదేవి కథను కూడా కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్నాడో నిర్మాత. శ్రీదేవి బంగ్లా పేరుతో సినిమా ప్రారంభించాడు. సాధారణంగా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సినిమా పేరులో శ్రీదేవి ఉండటం.. ఆ క్యారెక్టర్ బాత్ టబ్‌లో మరణించడం.. శ్రీదేవి జీవితాన్ని పోలి ఉన్నాయి.

Sridevi Bunglow


దీంతో ఈ సినిమాకు ఒక్కసారిగా పబ్లిసిటీ వచ్చింది. అందులోనూ ఈ సినిమాలో శ్రీదేవి క్యారెక్టర్‌ను కన్నుకొట్టుడు భామ ప్రియావారియర్ పోషిస్తోంది. శ్రీదేవి జీవితాన్నితన అనుమతి లేకుండా తీస్తున్నారని శ్రీదేవి భర్త బోనీకపూర్ లీగల్ నోటీసులు పంపినా సదరు నిర్మాత ఏమాత్రం బెదరడం లేదు.


బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!


పైగా.. శ్రీదేవి పేరు ఇంకే నటికూ ఉండదా.. శ్రీదేవిలా ఇంకెవరూ బాత్ టబ్‌లో పడి చనిపోరా.. అంటూ బుకాయించడం ప్రారంభించారు. అదీ నిజమే. మొత్తానికి శ్రీదేవి డెత్ మిస్టరీని, కాంట్రవర్సీని ఇలా తన సినిమా కోసం వాడుకుంటూ పైసా ఖర్చులేకుండా పబ్లిసిటీ సంపాదిస్తున్నాడా నిర్మాత. మరి ఈ సినిమా విడుదలైతే కానీ తెలియదు. శ్రీదేవి జీవితాన్ని కాపీ కొట్టారో లేదో..


మరింత సమాచారం తెలుసుకోండి: