తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్ణించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం బయోపిక్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో జయలలిత బయోపిక్ తీయడానికి దర్శక, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.  అన్నాడీఎంకే అధినేత ఎంజీఆర్ తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా నటి జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొంది.  ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతూ..ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిచే అమ్మా అని పిలుపించుకుంది.  ముఖ్యమంత్రిగా తమిళ రాజకీయాలను .. అక్కడి ప్రజలను జయలలిత ఎంతగానో ప్రభావితం చేశారు.
Image result for jayalalitha biopic nitya menon
ఆమె బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి ప్రియదర్శిని ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ది ఐరన్ లేడి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. అయితే ఆ మద్య జయలలిత పాత్ర ఎవరు చేస్తారన్న విషయం పై తర్జన భర్జన జరిగింది.  మొత్తానికి మళియాళ కుట్టి నిత్యామీనన్ అమ్మ పాత్రలో నటిస్తుందని తెలిసి  జయలలిత అభిమానులు సంతృప్తి చెందారు.
Image result for jayalalitha biopic nitya menon
తాజాగా ఈ సినిమా గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ..జయలలిత గారిపట్ల నాకు గల అభిమానం .. గౌరవమే ఆమె పాత్ర నాకు దక్కేలా చేశాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.  రాజకీయాలలో ఆమె సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కాకపోవచ్చునేమో. ప్రస్తుతం ఆమె జీవిత విశేషాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని..ఈ సినిమా ద్వారా ఆమె పట్ల నాకు గల అభిమానం .. గౌరవం మరింత పెరిగిపోతున్నాయి. జయలలిత వంటి గొప్పనాయకురాలి పాత్రను పోషిస్తుండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: