తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  కొంత మంది బాలనటులుగానే తమ ప్రస్థానం మొదలు పెట్టారు.  గతంలో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ‘సిసింద్రి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు.  జూనియర్ ఎన్టీఆర్, మంచు హీరోలు ఇలా ఎంతో మంది బాలనటులుగానే తమ ప్రస్థానం మొదలు పెట్టారు. 
Related image
తాజాగా వీరిబాటలోనే వస్తున్నాడు ప్రముఖ తమిళ హీరో సూర్య తనయుడు దేవ్.  మరికొన్ని నెలల్లో 'దేవ్' 9వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు. గతంలో సూర్య చిన్న పిల్లలతో ఓ చిత్రాన్ని నిర్మించారు..తెలుగు లో ‘మేము’గా విడుదలైంది.  అయితే ఈ చిత్రం తెలుగు లో పెద్ద ఆడలేదు కానీ..తమిళ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఆదరణ పొందింది.

ఇప్పుడు అలాంటి సినిమానే మరొకటి నిర్మించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సినిమాలో ఆయన తనయుడు 'దేవ్' కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడట.  ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ..కోలీవుడ్ లో మాత్రం టాక్ నడుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: