ఎన్టీరామారావు 23వ వర్దంతిని పురస్కరించుకుని ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులు కలిసి గట్టుగా రాకుండా  ఎవరికి వారు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. బాలయ్య  జూనియర్ కళ్యాణ్ రామ్ సుహాసిని ఇలా చాలమంది ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అయితే అందరికంటే ముందుగా ఇంకా సూర్యుడు ఉదయించక ముందే జూ ఎన్టీఆర్  కళ్యాణ్ రామ్ లు ఘాట్ వద్దకు చేరుకొని తమ తాతగారికి నివాళులు అర్పించి  కాసేపు అక్కడే కూర్చుని ఆయన జ్ఞాపకాలను తలుచుకుని బాధపడటం మీడియా కెమెరాలకు స్పష్టంగా కనిపించింది. 
ప్రతి సారి ముగ్గురూ... ఈ సారి ఇద్దరే.. మరింత బాధించే విషయం
ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు జూనియర్ ను మాట్లాడమని అడిగినా మీడియాతో మాట్లాడటానికి జూనియర్ ఇష్టపడలేదు. ఈ సందర్భంలో  అన్నదమ్ములు ఇద్దరూ బాధతో అక్కడే కొంతసేపు  కూర్చున్నారు.  జూనియర్ కళ్యాణ్ రామ్ లు అక్కడ నుండి వెళ్లిపోయాక  బాలకృష్ణ అక్కడకు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడమే కాకుండా ఈ భూమిమీద ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు ఇపట్లో పుట్టరు అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు బాలయ్య. 
ఆయన తెలుగు జాతికే గర్వ కారణం
ఇదే సందర్భంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఒక మనిషి మహోన్నత విజయ పథంలోకి  నడవాలన్నా అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలి అన్నా సంకల్పం కావాలి అంటూ అటువంటి సంకల్పం కలిగిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ తన తండ్రి పై ప్రప్రశంసలు కురిపించాడు. ఇక్కడ బాలయ్య మరొక ట్విస్ట్ ఇస్తూ ఈ రోజు ఏనాయకుడు ముందుకు వచ్చినా ఏపార్టీ గొంతు చించుకున్నా అవన్నీతన తండ్రి ప్రవేశపెట్టినా పథకాలు కాపీ కొడుతున్నవే అంటూ రాజకీయ పార్టీల పై సెటైర్లు వేసాడు.
అవినీతి సహించలేక రాజీనామా చేసి సినిమాల్లోకి...
అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడ జూనియర్ బాలకృష్ణలు వ్యూహాత్మకంగా ఎవరికి వారు వచ్చి వెళ్లి పోవడంతో ఈ పరిణామాలు దేనికి సంకేతం అంటూ చర్చలు జరుగుతున్నాయి. తెలుగు జాతీ ఉన్నంత వరకు రామారావు పేరు మారుమ్రోగుతూనే ఉంటుంది అన్న విషయం వాస్తవం అయినా అటువంటి మహానాయకుడి బయోపిక్ కు కనీసపు  కలెక్షన్స్ కూడ రాకపోవడంతో తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను మర్చిపోయారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: